‘ఖర్చు పెట్టి మేం సినిమా తీస్తే... రేట్లు డిసైడ్ చేయ డానికి వాళ్లెవరు? వాళ్లకేం హక్కు ఉంది? చిత్ర పరిశ్రమ చిన్నదేమీ కాదు. కోట్లతో ముడిపడిన వ్యవహారం. అది బాధ్యతతో కూడింది.’‘సినిమాలనేవి చిన్న ఇష్యూ. మరీ చీప్‌గా అడ గొద్దు. అసలు వాటి గురించి అంతగా ఆలోచించను.’
పరస్పర విరుద్ధమైన ఈ మాటలు అన్నది ఒకరే అంటే మీరు నమ్ముతారా? ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్! ఆయన మనిషొక్కరే, నాలుకలే రెండు... చాలా విషయాల్లోనూ ఆయనది ఇదే ధోరణి. కులాల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదంటారు. ఇష్టానుసారంగా మతాల గురించే మాట్లాడుతారు. ఆ మధ్య జరిగిన తిరుమల లడ్డూ వివాదంలో ఆయన ప్రవర్తించిన తీరే ఇందుకు ఉదాహరణ. అసలు లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలీదు. వేషం మార్చి ప్రజలను ఏ మార్చాలని ప్రయత్నించారు.
‘ఓ పవన్ స్వామీ అధికారంలో ఉన్నది నీవే. విచారణ జరిపించు. జరిగి ఉంటే దోషుల్ని శిక్షించు’ అని ఎంతమంది మొత్తుకున్నా చెవి కెక్కించుకున్న పాపాన పోలేదు. పైగా పాపానికి ప్రాయ శ్చిత్తం అంటూ గుడి మెట్లు కడిగారు. (తర్వాత ఈ విషయంపై కోర్టు చీవాట్లు పెట్టడం, విచారణకు ఆదేశించడం తెలిసిందే) నిజానికి కుల మతాలకు అతీతంగా ప్రజలు తిరుమల లడ్డూను పవిత్రంగా చూస్తార న్నది అందరికీ తెలిసిందే. ఇంత ‘సున్నితమైన’ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసిన ఘనుడు ఈయన.
‘సార్... విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అదానీ పాత్ర అవినీతిపై మీరేమంటార’ని ఆ మధ్య మీడియా వారు ప్రశ్నించారు. ఒక్క క్షణం ఆలోచించకుండా ‘ఇది సున్నితమైన అంశం’ అంటూ జారుకున్నారు. సున్నితమైన లడ్డూ వివాదంలో ఊరంతా తెలి సేలా... పైగా మరో మత విషయాలు లాగి... ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడిన పవన్‌కి ప్రభు త్వాల మధ్య జరిగిన వ్యవహారం సున్నితంగా కనిపించడం విడ్డూరమే!
పవన్‌కల్యాణ్‌లోని కోణాలు వ్యక్తులను బట్టి మారతాయి. పరి స్థితులను బట్టి తారుమారవు తాయి. వైఎస్సార్‌సీపీలో క్షేత్ర స్థాయిలో ఒకడు తప్పు చేస్తే చాలు... ఆ క్షణమే ఆ తప్పును ఎండగడతారు. అంతటితో ఆగరు. ఆ పార్టీ అధినేత జగన్‌నూ దూషిస్తారు. స్వయానా జనసేన ఎమ్మెల్యే తప్పు చేసినా... ఓ దళిత ప్రొఫెసర్‌పై దాడికే దిగినా చూస్తుంటారు తప్ప... అస్సలు మాట్లాడరు.
చేగువేరా ఇష్టమంటారు, ఎర్రజెండాతో జత కడ తారు. కొద్ది రోజులకే ఆ కత ముగిస్తారు. గాంధీజీకి జై కొడతారు... గాడ్సే మంచోడంటూ తన అన్నతోనే చెప్పి స్తారు. ‘పాచిపోయిన లడ్డూలు ఇచ్చార’ని బీజేపీపై తెగ ఆవేశపడిపోతారు. అంతలోనే నమోన్నమః అంటూ కాషాయానికి కట్టుబానిసవుతారు. ఒకటా రెండా... చెప్పుకుంటూ పోతే కల్యాణ్‌లోని కోణాలు కోకొల్లలు.
– షబ్బీర్
అన్నీ మాయమాటలే తప్ప...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల్లో కంటే నిజ జీవితంలో బాగా నటిస్తాడని పేరు సంపాదించుకున్నారు. తన అభిమానులపై ఒక్కోసారి ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తారు. కోప్పడిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఛీ కొట్టడం, ‘మీరు లేకపోతే నేను లేనబ్బా’ అనడం ఆయనకే చెల్లింది. నిత్యం మాయమాటలతో అభిమాన తరంగాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు పవన్.
‘ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాల్లేవు. ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వడా నికి టైం పడుతుంది. కనీసం సినిమాకెళ్లి చొక్కా చించుకుని అరవకపోతే... ఎక్స్‌లేటర్ పెంచుకుంటూ బైక్‌లో వెళ్లకపోతే... ఆ ఎనర్జీ అంతా ఎటెళ్తది?’ ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫంక్షన్‌లో డిప్యూటీ సీఎం మాటలివి. లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివానని పలు సంద ర్భాల్లో చెప్పిన పవన్ అభిమానుల విషయంలో ఏ స్థాయిలో దిగజారి ఆలోచి స్తున్నారో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
సినిమాలు, రాజకీయాలను మిక్స్ చేసేసి తన అభిమానులపై పూర్తిస్థాయిలో రుద్దుతూ వారికి మరో లక్ష్యం లేకుండా చేస్తున్నారాయన. ఇద్దరు అభిమానులు చని పోతే బాధ్యత లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనే నెట్టాలని చూసిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించ గలమని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాడు హీరోలు, దర్శకులు తదితరులు కలిస్తే గగ్గోలు పెట్టిన పవన్... అదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకున్నారు.
‘మీరు కోరుకున్నట్టుగా సీఎం స్థానానికి వెళ్లలేక పోయినా... డిప్యూటీ సీఎం అయ్యాను. రాష్ట్రానికి మంచి చేస్తాను. మీరు బాగా చదువుకుని బాగుపడండి’ అని చెప్పాల్సింది పోయి సినిమాల్లేకపోతే ఏం చేస్తార నడం ఎంత మాత్రం సబబుగా లేదనేది ప్రజాస్వామ్య వాదుల మాట. ఈ దేశంలో క్రికెట్, సినిమాలతో జనానికి విడదీయరాని అనుబంధం ఉంది. కానీ ఒకప్పటిలా వాటిపై పిచ్చితో లేరు. యువత కెరీర్ పైనే అధికంగా ఫోకస్ పెట్టింది. ఓటీటీలో వచ్చినప్పుడు ఆ మూవీ చూడొచ్చులే అనుకునే వారెందరో! మంచి చెప్పకుండా ఎక్స్‌లేటర్ పెంచి తిరగండి అంటే రోడ్డుపై తిరిగే జనం ఒప్పుకోరు.
నిద్ర లేచింది మొదలు జగన్‌పై పడి ఏడుస్తుంటారు పవన్. కానీ జగన్ ఏనాడూ బాధ్యత మరిచి మాట్లాడ లేదు. ప్రతి ఇంట్లో ఉన్నత చదువులు చదివిన వారుండాలని కలలుగన్నారు. పేద కుటుంబాలు సమాజంలో గౌరవం పొందాలంటే చదువే మార్గమన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తన వంతు కృషి చేశారు. ఉద్యోగాలివ్వడానికి టైం పడుతుంది అనకుండా అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే యువతకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అవకాశాలు కల్పించారు. వారిలో పవన్ అభి మానులు కూడా ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయాలు చూడలేదు. యువత బాగుండాలని మాత్రమే కోరు కున్నారు.
– వెంకట్
Comments
Please login to add a commentAdd a comment