హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కరెంట్ కొరత, రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆర్ కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నగర శివారులో తమతో పాటు బస్సుయాత్రలో పాల్గొంటారని, ఇక ధర్మారెడ్డి వరంగల్ జిల్లా బస్సుయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని, శనివారం ఆయన యాత్రలో పాల్గొంటారని ఎంపీ గరికపాటి మోహన్ రావు తెలిపారు. అయితే బస్సుయాత్ర నల్గొండ జిల్లా చేరుకున్నా మంచిరెడ్డి మాత్రం హాజరు కాలేదు. మరోవైపు కారు ఎక్కుబోయి చివరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బస్సు యాత్రలో పాల్గొన్నారు.
బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా
Published Fri, Oct 10 2014 11:55 AM | Last Updated on Fri, Aug 10 2018 9:23 PM
Advertisement
Advertisement