ఎల్బీ నగర్లో ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి | TDP workers attack lb nagar tdp condidate R.Krishnaiah | Sakshi
Sakshi News home page

ఎల్బీ నగర్లో ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి

Published Wed, Apr 9 2014 2:38 PM | Last Updated on Fri, Aug 10 2018 9:23 PM

ఎల్బీ నగర్లో  ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి - Sakshi

ఎల్బీ నగర్లో ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి

హైదరాబాద్ : టీడీపీలో పొత్తు చిచ్చు పెడుతోంది. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గడ్డి అన్నారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆర్. కృష్ణయ్య వాహనం ధ్వంసం అయ్యింది. ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేయకుండా ప్రత్యర్థి వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనలో కృష్ణయ్య స్వల్పంగా గాయపడ్డారు. ఇక  దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో టీడీపీ రెబల్ అభ్యర్థి కార్యకర్తలతో పాటు, టీర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉండటంతో ఎవరు దాడికి పాల్పడ్డారనే ఇతిమిద్దంగా తెలియలేదు. మరోవైపు ఆర్.కృష్ణయ్యకు టికెట్ కేటాయింపుతో ఎల్బీనగర్ టీడీపీ ఇంచార్జ్  కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement