
సాక్షి, అమరావతి: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ (ఐడీఈఎస్) 1991 బ్యాచ్‌కు చెందిన ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ధర్మారెడ్డి అక్కడ రిలీవై బుధవారం రాష్ట్ర సచివాలయంలో రిపోర్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా పారుమంచల గ్రామానికి చెందిన ఏవీ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా తిరుమలలో టీటీడీ ప్రత్యేక అధికారిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment