
సాక్షి,అమరావతి: స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌గా టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. తాజాగా ఆయన స్థానంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ రోజువారీ వ్యవహారాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది.
టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్ మార్పు
సాక్షి, అమరావతి: స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్‌గా నియమితులైన టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌ను తాత్కాలికంగా తిరుపతి నుంచి వెలగపూడి సచివాలయానికి మారుస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవో రోజువారీ వ్యవహారాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
చదవండి: సత్యసాయి మహా సమాధి దర్శనం రద్దు