తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్లో వలసలు ఊపందుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. తనతో పాటు టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నట్టు ధర్మారెడ్డి చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.