సాక్షి, తిరుపతి: కోట్లాదిమంది మనోభావాలు దెబ్బతినేలా తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించిన నెయ్యి విషయంలో చంద్రబాబు తప్పులు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. ఈ అంశంలో చంద్రబాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లు కనిపిస్తోంది.
తిరుమలలో ప్రస్తుతం ఆగమేఘాలపై చంద్రబాబు పరమపవిత్రంగా భావించి తెప్పించిన నందిని నెయ్యిని.. గతంలో అనేక మార్లు కలుషితమైందని చెబుతూ వెనక్కి పంపారు. అది కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే.. కానీ నేడు నందిని నెయ్యి నాణ్యమైందని.. ఇక శ్రీవారి లడ్డు స్వచ్ఛంగా వస్తుందని ప్రగల్భాలు పలుకుతున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దెబ్బతీసేలా టిడిపి కూటమీ ప్రభుత్వం దుష్ర్ఫచారం చేస్తోంది. ఎలాగైనా వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేలా కుట్ర చేస్తోంది. అయితే ఈ అంశంలో చంద్రబాబు పూటకోమాట, రోజుకో కట్టుకథ చెప్పి అడ్డంగా దొరికిపోతున్నారు. దశాబ్దకాలంగా టీటీడీ సరఫరా చేసిన నందిని నెయ్యిని 2015లో మొదటిసారి పక్కకు తప్పించింది బాబు ప్రభుత్వమే. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తన బుర్రలో తోచిందే చెప్పి.. అదే వాస్తవం అంటు నమ్మిస్తున్నారు. తన వాళ్ళతో, పచ్చ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే చంద్రబాబు లక్ష్యం. అందు కోసం దేవుడినే రోడ్డున పెట్టాడు చంద్రబాబు.
గతంలో విషం! ఇప్పుడేమో..
కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ వేశారు. నందిని డెయిరీతో పాటు మరికొన్ని డెయిరీలు టెండర్‌లో పాల్గొన్నాయి. కానీ అప్పటీ తెలుగుదేశం ప్రభుత్వం నందినీ డెయిరీ కాదని, మహారాష్ర్టకు, కర్ణాటకకు చెందిన డెయిరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నందినీ డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరిగింది. అందుకే ఆ డెయిరీని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందన్నది టీటీడీ చిట్టాలో లిఖించారు.. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న మురళీమోహన్ అప్పటిలో ఓ ఛానల్ ప్రతినిధిగా ఉన్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు
నందినీ నెయ్యి పై వచ్చిన వివాదంపై మాట్లాడుతూ.. నందినీ నెయ్యిలో కలుషితం అయిందని, టీటీడీ నందినీ నెయ్యి వినియోగించి పవిత్రను మంటగలిపిందని ఆయన ఆరోపించారు. కానీ నేడు ఇదే ఎమ్మెల్యే మురళీమోహన్ నందిని నెయ్యి టీటీడీ ఎందుకు టెండర్ ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో టీటీడీ నెయ్యి సరఫరాకి టెండర్ పిలిస్తే నందినీ డెయిరీ టెండర్ పాల్గొనలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అప్పుడే మీడియా సమావేశం నిర్వహించి చెప్పారు. మరి టెండర్ పాల్గొనకుండా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు. వాస్తవాలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే స్థానంలో ఉండి అసత్యాలను చెప్పడం ఎంత వరకు సబబు?.
గతంలో చంద్రబాబు హయాంలో నందీనీ డెయిరీ కొడ్ చేసిన ధరకు టెండర్ ఇవ్వనందునే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ పాల్గొనడం లేదని నందిని డెయిరీ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంతో తక్కువ ధరకు కోడ్ చేసి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. ఇది వాస్తవం.. తిరుమల శ్రీవారి చెంత ఎవరు తప్పు చేసిన దొరకడం ఖాయం.. కాకుంటే కాస్త ఆలస్యం అవుతుందేమో అంతే... కానీ ఆ దేవదేవుడు ఇచ్చే శిక్ష మాత్రం మరింత దారుణంగా ఉంటుంది. దానీ నుంచి తప్పించుకొలేరు.
Comments
Please login to add a commentAdd a comment