రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను మృతి | CRPF jawan died in road accident at rangareddy district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను మృతి

Published Mon, Jul 25 2016 11:04 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం హకీంపేట్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ జవాను మృతిచెందారు.

షామీర్‌పేట: రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం హకీంపేట్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ జవాను మృతిచెందారు. నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నివాసం ఉండే ధర్మారెడ్డి అనే సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా జవహర్‌నగర్‌కు ఈరోజు ఉదయం బయలు దేరారు. హకీంపేట్ సమీపంలో జాతీయ రహదారిపై ఆయన బైక్‌ను బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది.ఈ ఘటనలో ధర్మారెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement