
ధర్మారెడ్డిని ఓదారుస్తున్న వైఎస్ విజయమ్మ
సాక్షి, నంద్యాల(జూపాడుబంగ్లా): పుత్రశోకంతో బాధపడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. మంగళవారం ఆమె ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాలకు చేరుకొన్నారు. ముందుగా ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటం వద్ద పూలువేసి నివాళులర్పించారు.
అనంతరం ధర్మారెడ్డి దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ విజయమ్మ పారుమంచాలకు వస్తున్నారనే విషయం తెలిసి గ్రామస్తులు తండోపతండాలుగా ధర్మారెడ్డి ఇంటివద్దకు చేరుకొన్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే గ్రామస్తులు ఆనందంతో కేకలువేస్తూ అభివాదం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment