
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జొన్నకూటి బాబాజీరావును పరామర్శిస్తున్న వైఎస్ విజయమ్మ. చిత్రంలో మంత్రి వనిత
సాక్షి, దేవరపల్లి/కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment