సీనియర్ శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రెడ్డి ,మొక్క శిఖలోఎర్రమట్టి వేసిన దృశ్యం
కౌడిపల్లి(నర్సాపూర్) మెదక్ : కత్తెర పురుగు మక్క రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. నివారణ చర్యలను ఒక్క రూపాయి ఖర్చులేకుండా మట్టితో నివారించవచ్చని మండలలోని తునికి వద్దగల డాక్టర్ డి రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరీక్షించి విజయం సాధించాడు. దీంతో ఈనెల 23న కలెక్టర్ ధర్మారెడ్డి కేవీకే వ్యవసాయ క్షేత్రానికి వస్తున్నట్లు కేవీకే ప్రతినిధి మధుకర్ తెలిపారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న, వరి పంటలపై కత్తెర పురుగు (మొక్కజొన్న లద్దెపురుగు) విజృంభిస్తుంది. దీన్ని గమనించిన కేవీకే సీనియర్ శాస్త్రవేత్త శ్యాంసుదందర్‌రెడ్డి అక్కడి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగపూర్వకంగా కత్తెర పురుగును సేంద్రియ పద్ధతిలో నివారంచవచ్చని నిరూపించాడు. కత్తెర పురుగు నివారణ కోసం ఎర్రమట్టిని మొక్కజొన్న శిఖలో వేస్తే మరుసటి రోజునుండి పురుగు ప్రభావం తగ్గిందని ఆయన తెలిపారు.
అలానాలుగు అయిదు రోజుల్లో పురుగు చనిపోతుందని చెప్పాడు. దీంతో పొలంలో ఉన్నమట్టితోనే నివారించవచ్చని రైతులు అదనంగా మందులు కొనాల్సిన పనిలేదని వివరించాడు. 23వ తేదీన ఉదయం 11గంటలకు కేవీకే వ్యవసాయ క్షేంత్రంలో పరిశీలించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి వస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment