Krushi vignana Kendram
-
‘గోవుల సంరక్షణ కోసం రూ. 25 వేలు’
సాక్షి, మెదక్ : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్నిశుక్రవారం గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులతో సాగుచేస్తున్న పంటలను, తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. సేంద్రీయ పద్దతుల ద్వారా వ్యవసాయం చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుంతుందని అన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వస్తే ఆత్మహత్యలు ఉండవని తెలిపారు. రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తూ వ్యవసాయం చెయ్యాలని సూచించారు. హిమాచల్ ప్రదేశలొ గోవుల సంరక్షణ కోసం రూ.25 వేలు ఇస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని, భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులతో రైతులు అనారోగ్యాల పలు అవుతున్నారని, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు మహిళ రైతులకు అవగాహన కల్పించాలని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నేడు కేవీకేకు కలెక్టర్ ధర్మారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్) మెదక్ : కత్తెర పురుగు మక్క రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. నివారణ చర్యలను ఒక్క రూపాయి ఖర్చులేకుండా మట్టితో నివారించవచ్చని మండలలోని తునికి వద్దగల డాక్టర్ డి రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరీక్షించి విజయం సాధించాడు. దీంతో ఈనెల 23న కలెక్టర్ ధర్మారెడ్డి కేవీకే వ్యవసాయ క్షేత్రానికి వస్తున్నట్లు కేవీకే ప్రతినిధి మధుకర్ తెలిపారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మొక్కజొన్న, వరి పంటలపై కత్తెర పురుగు (మొక్కజొన్న లద్దెపురుగు) విజృంభిస్తుంది. దీన్ని గమనించిన కేవీకే సీనియర్ శాస్త్రవేత్త శ్యాంసుదందర్రెడ్డి అక్కడి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగపూర్వకంగా కత్తెర పురుగును సేంద్రియ పద్ధతిలో నివారంచవచ్చని నిరూపించాడు. కత్తెర పురుగు నివారణ కోసం ఎర్రమట్టిని మొక్కజొన్న శిఖలో వేస్తే మరుసటి రోజునుండి పురుగు ప్రభావం తగ్గిందని ఆయన తెలిపారు. అలానాలుగు అయిదు రోజుల్లో పురుగు చనిపోతుందని చెప్పాడు. దీంతో పొలంలో ఉన్నమట్టితోనే నివారించవచ్చని రైతులు అదనంగా మందులు కొనాల్సిన పనిలేదని వివరించాడు. 23వ తేదీన ఉదయం 11గంటలకు కేవీకే వ్యవసాయ క్షేంత్రంలో పరిశీలించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి వస్తున్నట్లు తెలిపారు. -
నేటి వర్షాలతో పంటలకు ప్రయోజనంలేదు
–ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు వనపర్తిరూరల్: అల్పపీడన తుపాను వల్ల వేసిన పంటలకు ఎలాంటì ప్రయోజనం లేదని, ఒక్క కందికి మాత్రమే కొంత ఉపయుక్తంగా ఉంందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్ స్పందన, డాక్టర్ అనురాధ అన్నారు. రైతులు వేసిన పంటలను తీవ్రంగా నష్టపోయారని, కనీసం కందినైనా దక్కించుకోవాలన్నారు. మంగళవారం వారు మండల వ్యవసాయశాఖ అధికారి నర్సింహ్మరెడ్డితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, ఆముదం పంటలను పరిశీలించారు. మొక్కజొన్న ఇప్పటికే వేసిన పంటల పూర్తి స్థాయిలో నష్టాన్ని కూడగట్టుకుందని, అన్ని యజమాన్య పద్ధతులు పాటించినా వర్షాలు లేక రైతులు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేలు నష్టపోయినట్లు రైతులు చెప్పారన్నారు. ఆముదం కూడా 70 శాతం నుంచి 80శాతం వరకు పంటను రైతులు నష్టపోయారని వారు తెలిపారు. జొన్న పంట గింజలు గట్టిపడే దశలో ఉన్నందున వర్షాలకు గింజ బూజెక్కకుండా ప్రొఫికోనోజోల్ 0.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బందం పంటల పరిశీలనకు రాగా ఎంపీపీ Ô¶ ంకర్‌నాయక్ వారిని కలిసి వర్షాలు లేక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విన్నవించారు. ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు.