జొన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఎంపీపీ, రైతులు
నేటి వర్షాలతో పంటలకు ప్రయోజనంలేదు
Published Wed, Aug 31 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
–ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు
వనపర్తిరూరల్: అల్పపీడన తుపాను వల్ల వేసిన పంటలకు ఎలాంటì ప్రయోజనం లేదని, ఒక్క కందికి మాత్రమే కొంత ఉపయుక్తంగా ఉంందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్ స్పందన, డాక్టర్ అనురాధ అన్నారు. రైతులు వేసిన పంటలను తీవ్రంగా నష్టపోయారని, కనీసం కందినైనా దక్కించుకోవాలన్నారు. మంగళవారం వారు మండల వ్యవసాయశాఖ అధికారి నర్సింహ్మరెడ్డితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, ఆముదం పంటలను పరిశీలించారు. మొక్కజొన్న ఇప్పటికే వేసిన పంటల పూర్తి స్థాయిలో నష్టాన్ని కూడగట్టుకుందని, అన్ని యజమాన్య పద్ధతులు పాటించినా వర్షాలు లేక రైతులు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేలు నష్టపోయినట్లు రైతులు చెప్పారన్నారు.
ఆముదం కూడా 70 శాతం నుంచి 80శాతం వరకు పంటను రైతులు నష్టపోయారని వారు తెలిపారు. జొన్న పంట గింజలు గట్టిపడే దశలో ఉన్నందున వర్షాలకు గింజ బూజెక్కకుండా ప్రొఫికోనోజోల్ 0.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బందం పంటల పరిశీలనకు రాగా ఎంపీపీ Ô¶ ంకర్‌నాయక్ వారిని కలిసి వర్షాలు లేక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విన్నవించారు. ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు.
Advertisement
Advertisement