తాను చేసిన ద్రోహానికి ఇదే సరైంది అని చెప్పిందంటూ లేఖ విడుదల చేసిన ఏవోబీ ఎస్‌జెడ్‌సీ కార్యదర్శి గణేశ్
మావోయిస్టులవి మాయ మాటలంటూ ప్రతిగా మరో లేఖ విడుదల చేసిన ఎస్పీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పార్టీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీ సులు బంటి రాధ అలియాస్ నీల్సోను కోవ ర్టుకుట్రలో భాగం చేయడం ద్వారా ఆమె మరణానికి కారకులయ్యారు.. చివరకు రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణే‹శ్‌వెల్లడించారు. ఈ మేరకు ఆయన పేరి ట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ లోని వివరాల ప్రకారం.. ‘పోలీసు ఉన్నతాధి కారులు ఆమె కులం, జెండర్‌ను ఉపయోగించుకొని అవాస్తవాలతో కొన్ని సంఘాల పేరి ట పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు.
నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే పోలీసు లకు రాధ కులం, మహిళ అని మాట్లాడే అర్హ త లేదు. పీడితవర్గ మహిళగా సమస్యల్ని ఎదుర్కొని వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీ లో చేరింది. సభ్యురాలి నుంచి నాయ కత్వ స్థానంలోకి ఎదగడానికి ఆమె పట్టుదల, పార్టీ కృషి ఉంది. ఆపై ఆమె కుటుంబ బలహీనతలను పోలీసులు వాడు కొని విప్లవద్రోహిగా మార్చి పార్టీ నాయక త్వాన్ని నిర్మూలించాలని చూశా రు. ఇంతలోనే పార్టీ అప్రమత్తం కావడం, పోలీసుల పథకం విఫలమైంది’. అని పేర్కొన్నారు.
వాళ్లకు మానవత్వం లేదు..బండి రాధను చంపి మృతదేహాన్ని
రోడ్డుపై పడవేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువు పూర్తిచేసిన రాధను బలవంతంగా పార్టీలో చేర్చుకొని జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పా రు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.
రాధను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధిస్తూ కులం పేరుతో దూషించారని ఆమె సోదరుడు కూడా ఆరోపించా డని తెలిపారు. మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించిన దళిత మహిళ రాధపై పోలీస్ ఇన్‌ఫార్మర్ అని ముద్రవేయడం ఆ పార్టీ నేత ల నీచమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment