ఓ నేతపై అగ్ర నాయకత్వానికి రాసిన లేఖతో ఘర్షణ
లొంగుబాటలో.. మావోయిస్టు ముఖ్యనేతలు
సాక్షి, హైదరాబాద్ : ఇన్‌ఫార్మర్ అన్న ముద్రతో హత్యకు గురైన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో ఉదంతం ఇప్పుడు మాజీలు..ప్రస్తుత మావోయిస్టుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2017 డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చి0దని రాధ తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి చైతన్య మహిళా సంఘం సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అక్కడ నుంచి ఏవోబీ బో ర్డర్ మీదుగా దళంలో చేరింది. అక్కడే ఆమె పేరును నీల్సోగా మార్చారు.
సాంకేతిక విద్యావంతురాలు కావడంతో ఆమెను తొలుత సిగ్నల్ ఆపరేటర్‌గా నియమించి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వచ్చి.. నేతలు చెప్పిన వారికి సమాచారం (ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్) చేరవేసి, ఫోన్ స్విచాఫ్ చేసి, సిమ్‌కార్డు తీసేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది. అప్పటికే అడవిలో ఉన్న అగ్రనేతలకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
వారందరూ షుగర్, బీపీ, గుండె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కావాల్సిన మెడికల్ ఎక్విప్‌మెంట్, పరీక్షలు, మందు లు, చికిత్స మొత్తం రాధ అలియాస్ నీల్సోనే చూసుకునేది. అలా నీల్సో అనతికాలంలో అగ్ర నాయకత్వానికి దగ్గర అ య్యింది. అందుకే ఆమె సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్Œ ఫోర్స్ క మాండర్‌గా ఎదిగింది. ఆమెను లేడీ చేగువేరాగా పిలిచేవారు.
కరోనా సమయంలో వైద్యసేవలు
కరోనా ఫస్ట్ వేవ్‌లో మావోయిస్టులకు పెద్దగా నష్టం వాటి ల్లలేదు. కానీ..సెకండ్ వేవ్‌లో చాలామంది అగ్రనేతలు వరుసగా మరణించడం మొదలైంది. మందుల కోసం బయటకు వచ్చే కొరియర్లపై పోలీసు నిఘా తీవ్రమైంది. ఆ సమయంలో నీల్సోనే చాలా మంది దళ సభ్యులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడింది.
అయితే కరోనా తగ్గుముఖం పట్టాక.. ఓ అగ్రనేతతో నీల్సోకు విభేదాలు మొదలై.. తారస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో నీల్సో దళం వదిలి ఇంటికి వద్దామనుకుంది. కానీ, సదరు నేత తీరు, సిద్ధాంతాలు ఉల్లంఘిస్తున్న వైనాన్ని వివరిస్తూ.. మూడునెలల క్రితం అగ్ర నాయకత్వానికి లేఖ రాసింది.
ఈ లేఖ పార్టీలో తీవ్ర అలజడి రేపగా, దీనిపై నిజనిర్ధారణ చేయాలంటూ ఓ కీలకనేతకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో దళానికి వరుస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నీల్సోతో ఘర్షణ పడిన నేత నిజ నిర్ధారణకు వచ్చిన నేతకు రాధ ఇన్‌ఫార్మర్ అంటూ ఫిర్యాదు చేశాడు. అసలే పోలీసుల నుంచి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో అతని మాటలను అగ్రనేత సైతం విశ్వసించాడు. చివరికి నీల్సోకు మరణశిక్ష విధించారు.
లొంగుబాటులో మావోలు
రాధ హత్య దళంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము రాధ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భయంతో ప్రస్తుతం దళంలోని కొందరు సభ్యులు తెలంగాణ పోలీ సులను సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సెంట్ర ల్ కమిటీ మెంబర్లు కొద్ది రోజుల్లో సరెండర్ అవుతామంటూ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు.
కరోనాకు ముందు మావోయిస్టులు ఫిట్టర్, ఎల్రక్టీషియన్, మెకానికల్ డిప్లొమా చదువుకున్న గిరిజన యువతను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఐఈడీల తయారీ కోసమేనని అప్పుడే తెలంగాణ పోలీసులు అనుమానించారు. వెళ్లిన వారిలో చాలామంది అక్కడ ఉండలేకపోయారు. మెజారిటీ యువకులు అప్పటి కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment