
కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్ కరణ్ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు.
ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్’లో ఉంది. ఈ లెహెంగా సెట్ “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్" ఫ్యాబ్రిక్. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్ డబ్కా వర్క్, మోతీ గోల్డ్ సీక్విన్స్, సిగ్నేచర్ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్ పూర్తి పర్పుల్ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్ అత్యంత అద్భుతంగా ఉంది.
(చదవండి: మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment