palem
-
పాలెం మృతులకు నేటికీ జరగని న్యాయం
-
నేటి వర్షాలతో పంటలకు ప్రయోజనంలేదు
–ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు వనపర్తిరూరల్: అల్పపీడన తుపాను వల్ల వేసిన పంటలకు ఎలాంటì ప్రయోజనం లేదని, ఒక్క కందికి మాత్రమే కొంత ఉపయుక్తంగా ఉంందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్ స్పందన, డాక్టర్ అనురాధ అన్నారు. రైతులు వేసిన పంటలను తీవ్రంగా నష్టపోయారని, కనీసం కందినైనా దక్కించుకోవాలన్నారు. మంగళవారం వారు మండల వ్యవసాయశాఖ అధికారి నర్సింహ్మరెడ్డితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, ఆముదం పంటలను పరిశీలించారు. మొక్కజొన్న ఇప్పటికే వేసిన పంటల పూర్తి స్థాయిలో నష్టాన్ని కూడగట్టుకుందని, అన్ని యజమాన్య పద్ధతులు పాటించినా వర్షాలు లేక రైతులు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేలు నష్టపోయినట్లు రైతులు చెప్పారన్నారు. ఆముదం కూడా 70 శాతం నుంచి 80శాతం వరకు పంటను రైతులు నష్టపోయారని వారు తెలిపారు. జొన్న పంట గింజలు గట్టిపడే దశలో ఉన్నందున వర్షాలకు గింజ బూజెక్కకుండా ప్రొఫికోనోజోల్ 0.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బందం పంటల పరిశీలనకు రాగా ఎంపీపీ Ô¶ ంకర్‌నాయక్ వారిని కలిసి వర్షాలు లేక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విన్నవించారు. ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు. -
‘అభివద్ధి సూర్యుడు’ సీడీ విడుదల
బిజినేపల్లి : తెలంగాణ సాంస్కతిక సారధి కళాకారులు విజయకాంత్, శ్రీశైలం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలకు సంబంధించి ‘అభివద్ధి సూర్యుడు’ సీడీని శనివారం పాలెం గ్రామంలో విడుదల చేశారు. రేలారే రేలా జానపద కవి గాయకుడు శివనాగులు రచించిన పాట స్వరకల్పనలో ఈ సీడీని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్ పుప్పాల సుమలత, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, ఈఓ బ్రహ్మచారి ఆధ్వర్యంలో సీడీని విడుదల చేశారు. నాలుగు కోట్ల అభిమానులే నీ ఆయుధం అనే ట్యాగ్‌లైన్‌పై మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా సీడీని రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో కాశిదాసు, శ్రావణ్‌కుమార్, డప్పు లక్ష్మణ్, బత్తుల వెంకటేష్, గ్రామస్తులు రాము, శ్రీనివాస్, నాగన్న, సత్యయ్య ఉన్నారు. -
పాలెం దుర్ఘటనపై చార్జిషీటు
- వోల్వో బస్సు దగ్ధం కేసులో 10 మందిపై అభియోగం - ప్రమాదానికి కారణాలపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జాతీయ రహదారిపై వోల్వో బస్సు దగ్ధమై మొత్తం 45 మంది సజీవదహనమైన కేసులో సీఐడీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 అక్టోబర్ 30న జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించి పది మంది నిందితులను అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తూ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద కల్వర్టును ఢీకొని దగ్ధమైంది. ఈ కేసును సీఐడీ విభాగం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపింది. జాతీయ రహదారిలో ఏవైనా లోపాలున్నాయా? బస్సు డిజైన్‌లో లోపాలున్నాయా? అన్న అంశాలను పరిశీలించారు. పాలెం వద్ద బస్సు స్పీడ్‌గా వచ్చి కల్వర్టును ఢీకొనడం వల్ల.. అక్కడ లేచిన మంటలు బస్సు ముందు టైర్ల వెనక ఉన్న ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకులకు అంటుకోవడంతో బస్సు కాలిందని విచారణలో తేల్చారు. ఈ సమయంలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బస్సు అద్దాలను పగులగొట్టేందుకు అవసరమైన సుత్తి లాంటి అత్యవసర పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని దర్యాప్తులో తేల్చారు. ఘటనకు బాధ్యులుగా తేలిన జబ్బార్ ట్రావెల్స్ యాజమానులు షకీల్ జబ్బార్, అతని సోదరుడు, డ్రైవర్ ఫెరోజ్‌పాషా, క్లీనర్ అయాజ్‌పాషాలతో పాటు ఇతర సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చిన జేసీ దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య ఉమారెడ్డిని కూడా అరెస్టు చేశారు. అలాగే, లాభాపేక్షలో నిర్వాహకులు బస్సులో ఉండాల్సిన 45 సీట్ల కంటే అధికంగా మరో ఐదు సీట్లను ఏర్పాటు చేసినట్లు కూడా తేలింది. బస్సులో మంటలు త్వరగా విస్తరించడానికి బస్సు ఫ్లోర్‌ను చెక్కతో పాటు రబ్బర్ మాటింగ్ చేయడం మరో కారణంగా తేల్చారు. జాతీయ రహదారిపై పాలెం వద్ద కల్వర్టు పారాపిట్ వాల్ రహదారిలోకి కొద్దిగా చొచ్చుకొని వచ్చేలా నిర్మించడం కూడా ప్రమాదానికి కారణమని కూడా సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇన్ని విధాలుగా కేసును దర్యాప్తు చేసిన తర్వాత పది మంది నిందితులను అరెస్టు చేసి, వారిపై పకడ్బందీగా చార్జిషీటు రూపొందించారు. దీనిని మే 7న మహబూబ్‌నగర్ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ అదనపు డీజీ తెలిపారు. కేసుకు సంబంధించి అవసరమైన అనుబంధ పత్రాలను శనివారం కోర్టుకు అందజేసినట్లు వివరించారు. అంతేకాకుండా బస్సు దుర్ఘటనకు కారణమైన అంశాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 400 పేజీల నివేదికను శనివారం అందజేసినట్లు వివంచారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తును సమగ్రంగా పూర్తి చేసిన సీఐడీ అధికారులను ఆయన అభినందనలు తెలిపారు. -
పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం
అదొక మహా విప్లవం. అద్భుత గ్రామస్వరాజ్యం. యాభై ఏళ్ల క్రితమే ఒక మారుమూల కుగ్రామం దేశంలోనే సమగ్రాభివృద్ధిని సాధించిన ఐదు గ్రామాల్లో ఒకటిగా వెలుగొందింది. అది... పేదరికం, కరువు కాటకాలు, వలసలు, ఆకలిదప్పులు తప్ప అభివృద్ధి ఎరుగని పాలమూరు జిల్లాలోని ‘పాలెం’. ఆ అద్భుతానికి సృష్టికర్త పాలెం సుబ్బయ్యగా మన్ననలందుకున్న తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఆ ఊరు సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటిలో సమగ్ర వికాసం సాధించేలా చేసిన కృషీవలుడు. భూస్వామ్య సంస్కృతి రాజ్యమేలుతోన్న తరుణంలో పాలెం ప్రగతి కోసమే పుట్టాడేమోనన్నట్లుగా సుబ్బయ్య ఊళ్లో బడి, గుడి, కళాశాల, ఆసుపత్రి నిర్మింపజేశారు. విద్యార్ధులకు వసతి గృహాలు, ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి నివాస ఏర్పాట్లు చేశారు, ఆయన స్థాపించిన బడిలో, కళాశాలల్లో చదువుకుని ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యనిపుణులు, పరిపాలనా దక్షులు, అధ్యాపకులు, పరిశోధకులు, రచయితలు, కవులు, కళాకారులుగా దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ, జలగం, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వాళ్లెందరో ఆ ఊరిని సందర్శించి కీర్తించారు. యాభైఏళ్ల క్రితం ఇలాంటి అభివృద్ధి ఊహింపశక్యం కానిది. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలుకు సమీపంలోని బిజినేపల్లి మండలం పాలెం గ్రామం ఈ నెల 29న స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటోంది. విద్య, వైద్య గ్రామాభ్యుదయం 1958 నాటికే సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సుబ్బయ్య వితరణతో ఊళ్లో ఆసుపత్రిని కట్టించారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఒక మారుమూల పల్లెటూర్లో ఆసుపత్రి లేదు. ఆ తదుపరి వెటర్నరీని ఆసుత్రిని సైతం పూర్తి చేశారు. ఊరిలోని పురాతన వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి పాలెంకు రెండవ తిరుపతి పేరు తెచ్చారు. పెద్దగా చదువుకోని సుబ్బయ్య ఆ ఊరి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం పరితపించారు. ‘ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ని స్థాపించి హైస్కూలు చదవులు అందుబాటులోకి తెచ్చారు. వేంకటేశ్వరాలయం ఆదాయాన్ని పిల్లల చదువు కోసమే వెచ్చించేలా చేశారు. 1963లో శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కూడా ప్రారంభమైంది. పాలెం పిల్లలే కాదు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ సహా అనేక ప్రాంతాలకు అది విద్యాకేంద్రమైంది. కాలేజీ భవనాలు, ప్రయోగశాలల నిర్మాణానికి, నిర్వహణకు, అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాల తదితర ఖర్చుల కోసం 16 ఎకరాల సొంత భూమిని అమ్మేశారు. ఆ కళాశాలలోని మొదటి పీయూసీ బ్యాచ్ 80 శాతం ఉత్తీర్ణతను సాధించింది. దీంతో నల్లగొండ, కర్నూలు, కడప, అనంతపురం, తదితర జిల్లాల విద్యార్ధులు కూడా పాలెం బాట పట్టారు. 1964లో సుబ్బయ్య శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలను ఒకేసారి ప్రారంభించారు. మరో 25 ఎకరాల భూమిని అమ్మేశారు. ఆ పిదప నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేశారు. సమగ్రాభివృద్ధి పథం గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించిన సుబ్బయ్య 1960లలోనే పాలెంకు తాగు నీటి నల్లాల సౌకర్యాన్ని కల్పించారు. ఆనాడు అలాంటి సదుపాయం నగరాలు, జిల్లా, తాలూకా కేంద్రాలకే పరిమితం. 1971-72 సంవత్సరంలో హరిజనుల కోసం ఆయన కట్టించిన 60 పక్కా ఇళ్లకు నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభోత్సవం చేశారు. పాలెం అభివృద్ధిని కళ్లారా చూసి పీవీ ముగ్ధుడయ్యారు. సుబ్బయ్యను ఎమ్మెల్సీ పదవి చేపట్టాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. 1967లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ పాలెంలో ఏర్పాటైంది. రైతులకు చౌకగా రుణపరపతి సౌకర్యాలు విస్తరించాయి. సుబ్బయ్య కృషి ఫలితంగా 1969లో పాలెంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఏర్పాటైంది. అక్కడి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఆయన తన 20 ఎకరాల భూమిని ఇచ్చేశారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పాలెంలో పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు కూడా అప్పట్లోనే ఏర్పడ్డాయి. మహిళల కోసం కుటీర, చిన్న తరహా పరిశ్రమలు సైతం రూపుదిద్దుకున్నాయి. జిల్లాలోనే మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ పాలెంలోనే ఏర్పాటైంది. ఊరు ఎదిగిన కొద్దీ ఆయన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రజల సేవ కోసమే పుట్టానని భావించిన సుబ్బయ్య బతికినంత కాలం ప్రజా సేవలోనే గడిపారు. ఏ రాజకీయ పదవులు, సామాజిక హోదాలు ఆశించక సామాన్యునిగానే బతుకుతూ అనితర సాధ్యమైన సేవలను అందించారు. గ్రామాభివృద్ధి కోసం సర్వస్వం ధారపోసిన సుబ్బయ్య చివరకు అనేక కష్టాలను అనుభవించారు. ఏమైతేనేం ఆయన స్వప్నం పాలెం సర్వోతోముఖాభివద్ధిని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకోగలిగారు. పగిడిపాల ఆంజనేయులు (డిసెంబర్ 29న పాలెం స్వర్ణోత్సవాలు) -
నాటకాలు కట్టిపెట్టి.. న్యాయం చేయండి!
సీఎం, బొత్స, జేసీలపై ‘పాలెం వోల్వో’ బాధిత కుటుంబాల ఆగ్రహం 28న రాష్ట్ర వ్యాప్త కొవ్వొత్తుల ప్రదర్శన హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి, తమకు న్యాయం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తమను ఆదుకోవడంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దివాకర్ ట్రావెల్స్ యజమానులైన జేసీ సోదరులు నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాద మృతుల కుటుంబాల జేఏసీ కన్వీనర్, శాంతి సంఘం(ఐప్సో) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దారుణం జరిగి 2 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూర్చడంలో ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన బస్సు యాజమాన్యాన్ని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం శోచనీయమని, దీనినిబట్టి రాష్ట్రంలో రవాణా మాఫియాకు ప్రభుత్వమే అండగా ఉన్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఈ మాఫియా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 2వేల కోట్ల నష్టం వస్తోందని, అయినప్పటికీ పాల కులు సదరు మాఫియా విదిలించే డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని విరుచుకుపడ్డారు. అనంతరం, ‘ఆరని మంటల పోరాటం’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. 28న కొవ్వొత్తుల ప్రదర్శన: తమకు న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. -
దివాకర్ రోడ్ లైన్స్‌పై క్రిమినల్ కేసు: బొత్స
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో 45 మంది మృతికి కారణ మైన ఘోర దుర్ఘటనలో వోల్వో బస్సు యజమాని దివాకర్ రోడ్డు లైన్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సును ఆపరేట్ చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో రెండో డ్రైవర్ లేడని తేలిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా బస్సులను తనిఖీ చేస్తోందని, లోపాలున్న వాటిని వెంటనే సీజ్ చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 601 బస్సులపై కేసులు నమోదు చేయగా, 346 బస్సులను సీజ్ చేశామని, నల్లగొండ జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేసినట్టు వివరించారు. మరో 4 మృతదేహాల గుర్తింపు బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవదహనమైనవారి మృతదేహాలకు సంబంధించిన మూడో జాబితాను బుధవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. డీఎన్ ఏ నివేదికల ఆధారంగా బుధవారం మరో 4 మృత దేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద బుధవారం 11 మృతదేహాలను అధికారులు మృతుల కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ డీఎన్ఏ నివేదికల ఆధారంగా 38 మృతదేహాలను గుర్తించగా.. గత మూడురోజులుగా 35 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. -
నేడు మరో 8 మంది మృతదేహాలనివేదికలు అందే అవకాశం
-
అతి వేగంతోనే అనర్థం
వోల్వో బస్సు ప్రమాదంపై పోలీసుల నిర్ధారణ! మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: మహబూబ్‌నగర్ జిల్లా, పాలెం వద్ద చోటుచేసుకున్న బస్సు దగ్ధం ప్రమాద సంఘటన అతివేగం కారణంగానే సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అతివేగం వల్లే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందజేశారు. వనపర్తి సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో బెంగళూరుకు వె ళ్లిన ఓ బృందం జబ్బార్, దివాకర్ ట్రావెల్స్ కార్యాలయాలను తనిఖీ చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రెండు ట్రావెల్స్ మధ్య గల ఆర్థిక బంధంపైనా ఆరా తీశారు. లగేజి బుకింగ్ వివరాలను పరిశీలించిన మీదట పేలుడు పదార్థాలేమీ బస్సులో లేవని గుర్తించారు. బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టి అక్కడే ఆగిపోవడంతో ట్యాంకులో ఉన్న డీజల్ మొత్తం ఒకేచోట పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఘోరం జరిగిపోయిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ‘వోల్వో ఇండియా’ ప్రతినిధులతో ఆర్టీఏ అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ దుర్ఘటనలో అత్యంత ఆధునికమైన బస్సు నిమిషాల వ్యవధిలో బుగ్గిగా మారటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఆర్టీఏ అధికారులు, అందుకు దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ చేసేందుకు మంగళవారం వోల్వో ఇండియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత వోల్వో కంపెనీ నిపుణులు ఆ బస్సును పరిశీలించారు. అందులో వారు గుర్తించిన వివరాలను ఆధారం చేసుకుని, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని ఈ సమావేశంలో అధికారులు ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. యురోపియన్ రోడ్లకు సరిపడే డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న వోల్వో బస్సులు మన రోడ్లపై వేగంగా వెళ్లటం ఎంతవరకు మంచిది, మంటలంటుకున్నప్పుడు వాటిని క్షణాల్లో తీవ్రం చేస్తున్న కర్టెన్లు, రెగ్జిన్, ఏసీ వాయువుల విషయంలో నాణ్యత ప్రమాణాలేంటి, వోల్వో బస్సులను నడపటంలో డ్రైవర్లకు పునశ్చరణ తరగతులు నిర్వహించటం, ప్రమాదాలు సంభవించినప్పుడు వేగంగా ప్రయాణికులు బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఇలా పలు అంశాలపై అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే వాటిపై కంపెనీ యాజమాన్యంతో చ ర్చించి సవివరంగా సమాధానమిస్తామని ప్రతినిధులు వారికి సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, అదనపు, సంయుక్త కమిషనర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 520 బస్సులపై కేసులు నమోదు చేసి, 284 బస్సులను సీజ్ చేశారు. -
మరో 15 మృతదేహాల గుర్తింపు
మొత్తం 34 మృతదేహాలను గుర్తించిన అధికారులు 28 మృతదేహాల అప్పగింత నేడు మరో 8 మృతదేహాల నివేదికలు అందే అవకాశం హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్‌జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవ దహనమైన మృతదేహాల తాలూకు రెండో జాబితాను అధికారులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. డీఎన్ఏ నివేదికల ఆధారంగా మరో 15 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులకు మంగళవారం సాయంత్రం వరకూ 13 మృతదేహాలను అప్పగించగా.. సాయంత్రం ప్రకటించిన రెండో జాబితాలోని 6 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 3 మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి జాబితాలోని మరో మూడు మృతదేహాల సంబంధీకులు మంగళవారం మంచి రోజు కానందున (సెంటిమెంటు) బుధవారం తీసుకెళ్లనున్నారు. అంతకుముందు సోమవారం 3 మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. దీంతో ఇప్పటిదాకా 28 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్లైంది. మరో ఆరు మృతదేహాలను బుధవారం అప్పగించనున్నారు. ఇప్పటిదాకా మొత్తం 34 మృతదేహాల డీఎన్ఏ నివేదికలు అందగా మిగతా 8 మృతదేహాల నివేదికలు బుధవారం సాయంత్రంలోపు అందే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండో జాబితాలో గుర్తించింది వీరినే.. 1.ఎన్.ఎస్. గిరిధర్(62), 2.జి.వాసంతి(60), 3. శక్తికాంత్ రౌత్(28), 4. కె.రమ్య(26), 5. కె.రిదియ(30 నెలలు), 6. హరీష్ భగాయత్ (31), 7.చంద్రశేఖర్(28), 8. సురేష్ బాబు (26), 9. సాఖీబ్ అహ్మద్(27), 10.హసీబ్ అహ్మద్(24), 11.మహ్మద్‌ఆసీఫ్ (25), 12. ఫారూక్‌అలీ(24), 13.జబీన్ తాజ్(26), 14.ఉజ్మాసుల్తానా(6), 15.అజ్మతుల్లా (35). దర్యాప్తునకు ఆదేశించండి: హైకోర్టులో పిల్ మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించి, దానిని పర్యవేక్షించాలని హైకోర్టును అభ్యర్థిస్తూ హైకోర్టు న్యాయవాది ఎస్.రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కేంద్ర రవాణాశాఖ కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, జబ్బార్ ట్రావెల్స్, శ్రీకాళేశ్వరి ట్రావెల్స్, ఓల్వో ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లతో పాటు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై, దర్యాప్తు నివేదిక ఆధారంగా బస్సు దుర్ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని పిటిషనర్ కోరారు.