మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
కాగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావం పొందిన భారత జట్టు.. పాక్‌పై గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా హర్మాన్ సేన తమ సేవలను సజీవంగా ఉంచుకోవాలంటే పాక్‌పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఓ కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది
రాధా యాదవ్ ఎంట్రీ..
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పిన్న్ రాధా యాదవ్.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ అరుంధతి రెడ్డి స్ధానంలో రాధా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.
పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన.
Comments
Please login to add a commentAdd a comment