న్యూజిలాండ్ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.
టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్ సైమా ఠాకూర్ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలీడే(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఆఖరిలో అమీలియా కేర్(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.
టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో అమీలియా కేర్ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్ కేర్ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.
చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment