తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 22న గరుడవాహనం | TTD EO Dharma Reddy Key Comments Over Srivari Brahmotsavam | Sakshi
Sakshi News home page

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వచ్చే నెల 18న సీఎం జగన్‌ పట్టువస్త్రాల సమర్పణ

Published Thu, Aug 31 2023 3:55 PM | Last Updated on Thu, Aug 31 2023 4:46 PM

TTD EO Dharma Reddy Key Comments Over Srivari Brahmotsavam - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. 

కాగా, టీటీడీ ఈవో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్‌ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్‌ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్‌మెంట్‌లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్‌ భూమన


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement