సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అష్టవినాయక అతిథిగృహంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
కాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన టికెట్లు. అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. త్వరలో తిరుచానూరులో మహా వరుణయాగం ఉంటుంది. అష్ట వినాయక అతిథిగృహాంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తాం. వికాస్ నిలయంను ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి తెస్తాం.
స్వామివారి అభిషేకానికి కావాల్సిన నెయ్యి తిరుపతి గోశాల నుంచే వస్తోంది. వచ్చే ఏడాదికి గోశాలలో నెయ్యి ప్లాంట్ సిద్ధం చేస్తాం. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 22.25 లక్షలు. ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.085కోట్లు. ఆగస్టు నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 9.07లక్షలు. ఆగస్టు నెలలో లడ్డూ విక్రయాలు 1.09కోట్లు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు 43.07లక్షలు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment