అన్నదానం కాంప్లెక్స్‌లో ఏర్పాటైన కౌంటర్
తిరుమల: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బుధవారం దాతల కోసం మరో కౌంటర్‌ను టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ప్రారంభించారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. అయితే చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కౌంటర్ ఏర్పాటైంది. భక్తులు ఇక్కడ రూ.100 నుంచి విరాళాలు అందించవచ్చు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ప్రత్యేకాధికారి జి.ఎల్.ఎ.శాస్త్రి, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ శాస్త్రి, బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయం ఎదుట భక్తుల రద్దీ
హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని మంగళవారం 67,858 మంది దర్శించుకున్నారు. స్వామికి 28,536 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.15 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment