సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
సాక్షి, మెదక్ అర్బన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకూడదని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువుతో గాని, లేదా నగదుతో ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే 171 హెచ్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులకు సంబంధించిన వాటిపై ఎలాంటి రాతలు, పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించకూడదని తెలిపారు. నామినేషన్ సమయం నుంచి ఖర్చు అభ్యర్థి ఖాతాలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగకూడదన్నారు.
ఓటర్లను ప్రభావితం చేసినట్లు నిరూపణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పంపిణీ చేశారు. ఈవిషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు ఆర్డీఓ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ సత్యనారాయణ కళాశాలలో విచారణ చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున నాయకుల ఫొటోలతో ఉన్న వాటిని పంపిణీ చేయడం ప్రలోభాలకు గురిచేయడమేనని విద్యార్థుల నుంచి 150 బుక్‌లెట్స్‌ను రికవరీ చేసుకున్నారు.
వాటిని సీజ్‌చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తహసీల్దార్ తెలిపారు.లీ పంపిణీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అవుతుందని ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌడిపల్లిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, యూత్ నాయకులు అనీల్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి స్థాయిలో విచారించి పంపిణీ కార్యక్రమంలో ఇంక ఎవరైన ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
వెల్దుర్తిలో ఒకరిపై..
వెల్దుర్తి మండలం బండపోసాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో సంపరబోయిన సిద్దరాములు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ బుక్‌లెట్స్ పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాలతి విచారణ నిర్వహించి పంపిణీ చేసిన బుక్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు సిద్ధిరాములుపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌కిషన్, ఉపాధ్యాయుడు రామకిషన్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివేదిక సమర్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment