పనుల్లో బిజీగా ఉన్న ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది
మెదక్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయిపోయారు. ప్రతీ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఓటర్ల వివరాలు నమోదు చేసుకోవడం, వాటిలో మార్పులు, చేర్పులు, సవరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రతీ రోజు కలెక్టర్ ఎన్నికలకు సంబం«ధించి సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు జిల్లాలోని ఆయా గ్రామాలకు తెలియజేస్తూ... అక్కడ నుంచి సమాచారం రాబట్టుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
మెదక్, నర్సాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఏఏ పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, దివ్యాంగులకు కావాల్సిన సదుపాయాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అక్కడ పని చేసే సిబ్బందికి సూచనలిస్తున్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వాటికి తగినట్లుగా çసలహాలిస్తున్నారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్నికల విభాగంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు.
వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ మరో వైపు ఎన్నికల ఏర్పాట్ల గురించి తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్రపర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఈ పనులు చేస్తూనే మరో వైపు శాఖాపరమైన పనులు కూడా ఉండటంతో వారు బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులే కాకుండా ఆ కింది స్థాయి అధికారులు, సిబ్బంది సైతం తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎన్నికల సెల్‌ను కూడా ఏర్పాటు చేయడంతో వారు మరింత బిజీగా మారారు. ఏది ఏమైనా మరో నెలరోజుల పాటు ఎన్నికల హడావుడితో అధికారులు, సిబ్బంది బిజీగా ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment