
సాక్షి, తిరుమల : కౌంటర్ల నిర్వహణలో అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు పారదర్శకంగా నిర్వహించడంతో గతంలో కంటే రూ.56 లక్షలు తగ్గించామన్నారు. ప్రస్తుతం కౌంటర్లు నిర్వహించే వారు రూ.40 వేలు చెల్లిస్తే స్పాన్సర్‌షిప్ పొందొచ్చని తెలిపారు. త్వరలోనే అన్ని కౌంటర్లకు స్పాన్సర్‌షిప్ వస్తుందని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment