బంద్ నేపథ్యంలో టీటీడీ ఉచిత బస్సులు: జిల్లా కలెక్టర్
బంద్ నేపథ్యంలో టీటీడీ ఉచిత బస్సులు: చిత్తూరు కలెక్టర్
Published Tue, Aug 27 2013 7:39 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజన కు నిరసనగా 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్ నిబంధనలను సడలించారు. తిరుమల చేరుకునే విధంగా బైపాస్ మార్గం గుండా భక్తులను అనుమతించనున్నారు.
రేపటి నుంచి 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ నిబంధనల సడలించాం. బైపాస్ మార్గం గుండా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. తిరుమల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ఉచిత బస్సులు నడుపుతుంది. జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజు వెల్లఢించారు.
Advertisement
Advertisement