కోల్‌కతా: క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మ. సురక్షిత సమాచార సాంకేతికతల ఆధారంగా క్రిప్టోలు ఏర్పాటైనట్టు చెప్పారు. ఐసీసీ వర్చువల్‌గా నిర్వహించిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి శర్మ మాట్లాడారు. ‘‘క్రిప్టో పట్ల నేను ఎంతో సానుకూలంగా ఉన్నాను. ఇంటర్నెట్ మన నిత్యజీవితంలో భాగమైనట్టుగా, కొన్నేళ్లలో ఇదొక ప్రధాన టెక్నాలజీగా అవతరిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు.
ప్రస్తుతానికి క్రిప్టోలను స్పక్యులేటివ్ విధానంలో వినియోగిస్తున్నట్టు చెప్పారు. క్రిప్టోల్లేని ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, క్రిప్టోలన్నవి సార్వభౌమ కరెన్సీలకు ప్రత్యామ్నాయం కాబోవని తేల్చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకూ పేటీఎంను తీసుకెళతామని చెప్పారు. ప్రస్తుతానికి జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో జపాన్‌లో అతిపెద్ద పేమెంట్ సిస్టమ్‌ను నిర్వహిస్తున్నామని, త్వరలో సొంతంగానే దీన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత సంస్థలను ఇక్కడి వారికంటే విదేశీ ఇన్వెస్టర్లే చక్కగా అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment