Paytm founder Vijay Shekhar Sharma
-
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్‌సైట్‌లోని ఎఫ్ఏక్యూ సెక్షన్‌ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్‌ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్‌మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
తెలివంటే ఇదే మరి..రూ.2150కి అమ్మి రూ.640కి షేర్లు కొన్న పేటీఎం సీఈవో!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం డైరెక్టర్ విజయ్ శేఖర్ శర్మ రూ.11 కోట్లకు 1.7 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పేటీఎం సంస్థ గతేడాది నవంబర్‌లో ఐపీవోకి వెళ్లింది. ఐపీవోలో ఒక్కో షేరు రూ.2150 వద్ద పలికింది.ఆ సమయంలో విజయ్ శేఖర్ శర్మ పేటీఎం షేర్లను కొనుగోలు చేసే అధికారం లేదు. ఒకవేళ కొనుగోలు చేయాలని పేటీఎం ఐపీవో వచ్చిన ఆరునెలల ఎదురు చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 30న విజయ్ శేఖర్ శర్మ 1,00,552 షేర్లను రూ.6.31 కోట్లకు, మే 31వ తేదీన 71,469 షేర్లను రూ.4.68 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో వీటి వాల్యూ మొత్తంగా రూ.11 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది. -
పేటీఎం విజయ్‌శేఖర్ శర్మని క్రాస్ చేసిన నైకా ఫాల్గుని నాయర్
బ్యాంకింగ్ సెక్టార్‌పై బ్యూటీ పైచేయి సాధించింది. ఆర్థిక రంగంలో సేవలు అందించే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మని సౌందర్య ఉత్పత్తులు అందించే నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ వెనక్కి నెట్టారు. తాజాగా హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 ఫలితాల్లో ఇది చోటు చేసుకుంది. పేఈఎం, నైకా సంస్థలు గతేడాది నవంబరులో మార్కెట్లో ఐపీవోకి వచ్చాయి. స్థిరంగా ఫాల్గుని నాయర్ హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 జాబితాలో నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ సంపదన 4.9 బిలియన్ డాలర్లుగా తేలింది. ప్రపంచ సంపాదనపరుల లిస్టులో ఆమెకు 579వ స్థానం దక్కింది. సౌందర్య ఉత్పత్తులు అందించే కంపెనీగా నైకాను 2012లో ఫాల్గుని నాయర్ స్థాపించారు. నైకా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభించారు. చాపకింద నీరులా ఈ కంపెనీ కస్టమర్ల మనసును గెలుచుకుంది. గతేడాది ఐపీవోలో నైకా బంపర్‌హిట్ అయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఫాల్గుని నాయర్ సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా మారింది. ఆది నుంచి ఇబ్బందులే ఐఐటీ విద్యార్థిగా విజయ్‌శేఖర్ శర్మ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎంను ప్రారంభించారు. ఆరంభం నుంచి నిధుల సమన్యు ఎదుర్కొన్నా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. 2016 పెద్ద నోట్ల రద్దుతో పేటీఎం దశాదిశా మారిపోయింది. దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే టెక్‌ఫిన్ రంగంలో అనేక కంపెనీలు వచ్చాయి. గతేడాది నవంబరులో ఐపీవోలో పేటీఎం షేరు రూ.2150 దగ్గర ట్రేడ్ అయ్యింది. దీంతో 2.35 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో పేటీఎం శేఖర్ శర్మ సైతం బిలియనీర్‌గా మారిపోయాడు. పోయిన బిలియనీర్ హోదా గడిచిన మూడు నెలల కాలంలో పేటీఎం షేర్లు వరుసగా కోతకు గురవుతూ వస్తున్నాయి. దాదాపు షేరు ధర 70 శాతానికి పైగా పడిపోయింది. దీంతో మూడు నెలలుగా ప్రతీ రోజు విజయ్‌శేఖర్‌శర్మ ఆదాయానికి రోజుకు 88 కోట్ల కోత పడుతూ వచ్చింది. బుధవారం ఏకంగా రూ.630కి పడిపోవడంతో విజయ్‌శేఖర్ శర్మ మార్కెట్ క్యాప్ 999 మిలియన్లను పడిపోయింది. ఆఖరికి ఆయన బిలియనీర్ హోదాను కూడా కోల్పోయారు. గురువారం షేరు ధర సుమారు 18 శాతం క్షీణించి రూ. 616 దగ్గర ట్రేడవుతోంది. కోత పడినా గత నవంబరు నుంచి మార్కెట్లో కరెక్షన్ నెలకొంది. అనేక కంపెనీల షేర్ల విలువకు కోత పడింది. కానీ నైకా షేర్లకు ఈ ఇబ్బంది తప్పకపోయినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. ఐపీవో ఆరంభంలో నైకా షేరు రూ.2,205లు ఉండగా ప్రస్తుతం రూ.1522గా ఉంది. మొత్తంగా ఫాల్గుని నాయర్ సంపదకు కోత పడినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే! -
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు భారీ షాక్!
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు భారీషాక్ తగిలింది. మార్చి 16న ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో విజయ్ శేఖర్ బిలియనీర్ల స్థానాన్ని కోల్పోయారు. దేశంలోనే ఆదరణ పొందిన స్టార్టప్‌లలో ఒకటైన పేటీఎం షేర్ గత నాలుగు నెలల్లో దాని ఇష్యూ ధర రూ.2,150 నుండి 70 శాతానికి పైగా పడిపోయిందని ఫోర్బ్స్ డేటా తెలిపింది. ఫోర్బ్స్ ప్రకారం..నవంబర్ 18,2021న పేటీఎం ఐపీవోకి వెళ్లింది. అంతకు ముందు విజయ్ శర్మ సంపద 2.35 బిలియన్ల డాలర్ల గరిష్ట స్థాయి నుండి 999 మిలియన్లకు చేరుకుంది. అయితే ఆ రోజు నుంచి పేటీఎం ఫౌండర్ ప్రతిరోజు దాదాపు రూ.88 కోట్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లను సమీకరించింది. నవంబర్ 18న దీని విలువ 1.39 ట్రిలియన్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 50 అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కానీ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో దాదాపు 1 ట్రిలియన్ నష్టపోయి ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు పేటీఎం వ్యాల్యూ రూ.40వేల కోట్లకు తగ్గింది. దీంతో పేటీఎం అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 112వ స్థానంలో ఉంది. కంపెనీ ప్రతినిధి ప్రకారం, డిసెంబర్ త్రైమాసికం నాటికి, వన్97 కమ్యూనికేషన్స్‌లో శర్మ వాటా 8.9శాతం లేదా దాదాపు 57.67 మిలియన్ షేర్లు. యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు దాదాపు 30.97 మిలియన్ షేర్లు కూడా శర్మ తరపున ఉన్న ట్రస్ట్ షేర్లు. ఆయన వాటా విలువ రూ.5,558 కోట్లుగా ఉంది. చదవండి: పేటీఎమ్‌పై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్..! -
Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు
కోల్‌కతా: క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మ. సురక్షిత సమాచార సాంకేతికతల ఆధారంగా క్రిప్టోలు ఏర్పాటైనట్టు చెప్పారు. ఐసీసీ వర్చువల్‌గా నిర్వహించిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి శర్మ మాట్లాడారు. ‘‘క్రిప్టో పట్ల నేను ఎంతో సానుకూలంగా ఉన్నాను. ఇంటర్నెట్ మన నిత్యజీవితంలో భాగమైనట్టుగా, కొన్నేళ్లలో ఇదొక ప్రధాన టెక్నాలజీగా అవతరిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్రిప్టోలను స్పక్యులేటివ్ విధానంలో వినియోగిస్తున్నట్టు చెప్పారు. క్రిప్టోల్లేని ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, క్రిప్టోలన్నవి సార్వభౌమ కరెన్సీలకు ప్రత్యామ్నాయం కాబోవని తేల్చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకూ పేటీఎంను తీసుకెళతామని చెప్పారు. ప్రస్తుతానికి జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో జపాన్‌లో అతిపెద్ద పేమెంట్ సిస్టమ్‌ను నిర్వహిస్తున్నామని, త్వరలో సొంతంగానే దీన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత సంస్థలను ఇక్కడి వారికంటే విదేశీ ఇన్వెస్టర్లే చక్కగా అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
భారీగా పెరిగిన పేటీఎం నష్టాలు
ముంబై : వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్ వ్యాలెట్ పేటీఎం గురించి తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఆన్లైన్ లావాదేవీలకు పేటీఎంనే వాడుతున్నారు. అంతలా మార్కెట్లోకి దూసుకొచ్చింది పేటీఎం. కానీ పేటీఎం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ సంస్థనే భారీ నష్టాల పాలు చేస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం నష్టాలు దాదాపు 80 శాతం మేర పెరిగి రూ.1600 కోట్లగా నమోదైనట్టు తెలిసింది. కంపెనీ తన పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం మాల్, కొత్త మ్యూచువల్ ఫండ్ బిజినెస్ పేటీఎం మనీని విస్తరించే ప్రణాళికలను అమలు చేస్తుండటం, పేటీఎంకు తీవ్ర దెబ్బ తగులుతోంది. వీటి విస్తరణతో నష్టాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నష్టాలు విపరీతంగా పెరిగిపోవడంతో, కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ, వార్షిక వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లకు తగ్గింది. 2016-17లో ఆయన వేతనం రూ.3.47 కోట్లగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ విజయ్ శేఖర్ శర్మ వార్షిక వేతనం రూ.3 కోట్లగానే ఉండనున్నట్టు తెలిసింది. ఉద్యోగులకు సంబంధించిన ఖర్చులు కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్లకు పెరిగినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. ఇటీవలే మార్కెట్ మాంత్రికుడు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే పేటీఎంలో రూ.356 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కంపెనీ రూ.7600 కోట్ల రిజర్వును, మిగులును కలిగి ఉంది. ఈ ఏడాది ఫిన్‌టెక్ ప్రొడక్ట్‌లపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు శర్మ చెప్పారు. తమ కస్టమర్ బేస్‌ను విస్తరించుకోనున్నట్టు పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ కోసం త్వరలోనే పేటీఎం మనీని లాంచ్ చేయనున్నామని, ఇతర సర్వీసులను విస్తరించనున్నామని, అలా కస్టమర్ బేస్‌ను పెంచుకుంటామని శర్మ చెబుతున్నారు. కానీ ఈ విస్తరణలో భాగంగానే పేటీఎంకు నష్టాలు పెరుగుతున్నాయి. -
పేటీఎం అధినేత తన వాటా అమ్మేశారు!
బెంగళూరు : డిజిటల్ పేమెంట్స్, కామర్స్ ప్లాట్ఫామ్లో అగ్రగామి సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, వన్97 కమ్యూనికేషన్లో తనకున్న షేర్ల వాటాలో 1శాతం విక్రయించారు. ఈ అమ్మకంతో ఆయన రూ.325 కోట్లను ఆర్జించారు. ఈ నగదును తన గ్రూప్ ప్రతిపాదిత పేమెంట్ బ్యాంకులోకి మళ్లించనున్నారు. ఈ షేరును వన్97 కమ్యూనికేషన్స్ షేర్ హోల్డర్‌కే అమ్మినట్టు తెలిసింది. అయితే ఆ హోల్ హోల్డర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీ గతవారంలోనే ముగిసినట్టు శర్మ చెప్పారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ వద్ద డాక్యుమెంట్ల ప్రకారం శర్మ 2016 మార్చి నాటికి వన్97 కమ్యూనికేషన్స్‌లో 21.33 శాతం స్టాక్‌ను కలిగిఉన్నారు. తాజా ఈ విక్రయంతో ఆయన స్టాక్ 20.33 శాతానికి తగ్గింది. వన్97 కమ్యూనికేషన్స్‌లో ఆయన లావాదేవీల విలువ మొత్తం 4.7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ 5న ఆయన తన వాలెట్ బిజినెస్‌లను పేమెంట్ బ్యాంకు సంస్థగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ఒక్కసారి పేమెంట్ బ్యాంకు లైసెన్స్ వచ్చాక వెంటనే పేమెంట్ అధినేత ఆ లావాదేవీలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచి ప్రాథమిక సమ్మతి రాగా, ఇంకా తుది అంగీకారం వెలువడాల్సి ఉంది. ఆర్బీఐ నిబంధనల మేరకు పేమెంట్స్ బ్యాంకును కొత్త సంస్థగా స్థాపించడానికి 51 శాతం స్టాక్‌ను కలిగి ఉన్నామని శర్మ చెప్పారు. పెద్ద నోట్లను రద్దుచేసినప్పటి నుంచి పేటీఎం లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తన కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారించింది. మరోవైపు ఉద్యోగులను కూడా భారీగానే పెంచుతోంది. ప్రస్తుతం పేటీఎంలో 11,000 ఉద్యోగులు పనిచేస్తుండగా.. గత నెల నుంచి 1,500 మంది కొత్త ఉద్యోగులను కంపెనీ చేర్చుకుంది. కొత్తగా మరో 20వేల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. యాప్ డేటా ట్రాకర్ యాప్అన్నీ ప్రకారం ఈ కంపెనీకి 88 మిలియన్ యాక్టివ్ యూజర్లున్నారు.