ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు భారీషాక్ తగిలింది. మార్చి 16న ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో విజయ్ శేఖర్ బిలియనీర్ల స్థానాన్ని కోల్పోయారు. దేశంలోనే ఆదరణ పొందిన స్టార్టప్‌లలో ఒకటైన పేటీఎం షేర్ గత నాలుగు నెలల్లో దాని ఇష్యూ ధర రూ.2,150 నుండి 70 శాతానికి పైగా పడిపోయిందని ఫోర్బ్స్ డేటా తెలిపింది.
ఫోర్బ్స్ ప్రకారం..నవంబర్ 18,2021న పేటీఎం ఐపీవోకి వెళ్లింది. అంతకు ముందు విజయ్ శర్మ సంపద 2.35 బిలియన్ల డాలర్ల గరిష్ట స్థాయి నుండి 999 మిలియన్లకు చేరుకుంది. అయితే ఆ రోజు నుంచి పేటీఎం ఫౌండర్ ప్రతిరోజు దాదాపు రూ.88 కోట్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సంస్థ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లను సమీకరించింది. నవంబర్ 18న దీని విలువ 1.39 ట్రిలియన్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 50 అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కానీ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో దాదాపు 1 ట్రిలియన్ నష్టపోయి ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు పేటీఎం వ్యాల్యూ రూ.40వేల కోట్లకు తగ్గింది. దీంతో పేటీఎం అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 112వ స్థానంలో ఉంది.
కంపెనీ ప్రతినిధి ప్రకారం, డిసెంబర్ త్రైమాసికం నాటికి, వన్97 కమ్యూనికేషన్స్‌లో శర్మ వాటా 8.9శాతం లేదా దాదాపు 57.67 మిలియన్ షేర్లు. యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు దాదాపు 30.97 మిలియన్ షేర్లు కూడా శర్మ తరపున ఉన్న ట్రస్ట్ షేర్లు. ఆయన వాటా విలువ రూ.5,558 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment