
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం డైరెక్టర్ విజయ్ శేఖర్ శర్మ రూ.11 కోట్లకు 1.7 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
పేటీఎం సంస్థ గతేడాది నవంబర్‌లో ఐపీవోకి వెళ్లింది. ఐపీవోలో ఒక్కో షేరు రూ.2150 వద్ద పలికింది.ఆ సమయంలో విజయ్ శేఖర్ శర్మ పేటీఎం షేర్లను కొనుగోలు చేసే అధికారం లేదు. ఒకవేళ కొనుగోలు చేయాలని పేటీఎం ఐపీవో వచ్చిన ఆరునెలల ఎదురు చూడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మే 30న విజయ్ శేఖర్ శర్మ 1,00,552 షేర్లను రూ.6.31 కోట్లకు, మే 31వ తేదీన 71,469 షేర్లను రూ.4.68 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో వీటి వాల్యూ మొత్తంగా రూ.11 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment