పేటీఎం అధినేత తన వాటా అమ్మేశారు!
పేటీఎం అధినేత తన వాటా అమ్మేశారు!
Published Fri, Dec 9 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
బెంగళూరు : డిజిటల్ పేమెంట్స్, కామర్స్ ప్లాట్ఫామ్లో అగ్రగామి సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, వన్97 కమ్యూనికేషన్లో తనకున్న షేర్ల వాటాలో 1శాతం విక్రయించారు. ఈ అమ్మకంతో ఆయన రూ.325 కోట్లను ఆర్జించారు. ఈ నగదును తన గ్రూప్ ప్రతిపాదిత పేమెంట్ బ్యాంకులోకి మళ్లించనున్నారు. ఈ షేరును వన్97 కమ్యూనికేషన్స్ షేర్ హోల్డర్కే అమ్మినట్టు తెలిసింది. అయితే ఆ హోల్ హోల్డర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీ గతవారంలోనే ముగిసినట్టు శర్మ చెప్పారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ వద్ద డాక్యుమెంట్ల ప్రకారం శర్మ 2016 మార్చి నాటికి వన్97 కమ్యూనికేషన్స్లో 21.33 శాతం స్టాక్ను కలిగిఉన్నారు. తాజా ఈ విక్రయంతో ఆయన స్టాక్ 20.33 శాతానికి తగ్గింది. వన్97 కమ్యూనికేషన్స్లో ఆయన లావాదేవీల విలువ మొత్తం 4.7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ 5న ఆయన తన వాలెట్ బిజినెస్లను పేమెంట్ బ్యాంకు సంస్థగా మార్చబోతున్నట్టు ప్రకటించారు.
ఒక్కసారి పేమెంట్ బ్యాంకు లైసెన్స్ వచ్చాక వెంటనే పేమెంట్ అధినేత ఆ లావాదేవీలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచి ప్రాథమిక సమ్మతి రాగా, ఇంకా తుది అంగీకారం వెలువడాల్సి ఉంది. ఆర్బీఐ నిబంధనల మేరకు పేమెంట్స్ బ్యాంకును కొత్త సంస్థగా స్థాపించడానికి 51 శాతం స్టాక్ను కలిగి ఉన్నామని శర్మ చెప్పారు. పెద్ద నోట్లను రద్దుచేసినప్పటి నుంచి పేటీఎం లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తన కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారించింది. మరోవైపు ఉద్యోగులను కూడా భారీగానే పెంచుతోంది. ప్రస్తుతం పేటీఎంలో 11,000 ఉద్యోగులు పనిచేస్తుండగా.. గత నెల నుంచి 1,500 మంది కొత్త ఉద్యోగులను కంపెనీ చేర్చుకుంది. కొత్తగా మరో 20వేల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. యాప్ డేటా ట్రాకర్ యాప్అన్నీ ప్రకారం ఈ కంపెనీకి 88 మిలియన్ యాక్టివ్ యూజర్లున్నారు.
Advertisement
Advertisement