న్యూఢిల్లీ : పేటీఎంపై నెలకొన్న అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (pbbl)కు వ్యతిరేకంగా మనీ ల్యాండరింగ్‌పై విచారణ చేపట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈడీ అధికారుల విచారణతో పేటీఎం బాస్‌కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. గత నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్‌బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
ఆ తర్వాత ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పీపీబీఎల్ పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడంతో తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు విజయ్ శేఖర్ శర్మ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఈడీ అధికారులు విచారణ చేపట్టడం ఫిన్‌టెక్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
చదవండి👉 పేటీఎంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment