వినియోగదారులకు పేటీఎం బాస్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ విజ్ఞప్తి! | Vijay Shekhar Sharma Clarifies After Rbi Extends Deadline For Services | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు పేటీఎం బాస్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ విజ్ఞప్తి!

Published Sat, Feb 17 2024 11:19 AM | Last Updated on Sat, Feb 17 2024 11:46 AM

Vijay Shekhar Sharma Clarifies After Rbi Extends Deadline For Services - Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఫిబ్రవరి 29 విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. 

మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషిన్‌ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్‌ తెలిపారు. ఆర్‌బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు. 

మార్చి 15, 2024 వరకు ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్‌లు అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందు ఈ గడువు తేదీ ఫిబ్రవరి 29, 2024 ఉండగా.. తాజాగా ఆ తేదీని మార్చి 15కి పొడిగించింది. 

‘పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ , సౌండ్‌బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయి. తాజా జారీ చేసిన ఎఫ్‌ఏక్యూ (Frequently Asked Questions)పాయింట్ 21లో ఆర్‌బీఐ ఇదే  స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లకు లొంగిపోకండి. మిమ్మల్ని డిజిటల్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలబెట్టేందు చేసే ప్రయత్నాలకు మీరు అనుమతించకండి’ అంటూ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.




అవధులు లేని మీ సపోర్ట్‌కు 
ఈ జనవరిలో ఆర్‌బీఐ పేటీఎంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం బాస్‌ ఎక్స్‌.కామ్‌లో ట్వీట్‌ చేశారు. అవధులులేని మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్‌ పనిచేస్తుందని యూజర్లకు హామీ ఇచ్చారు. ప్రతి సవాలుకు, ఒక పరిష్కారం ఉంది. ఫిన్‌ రంగం తరుపున దేశానికి సేవ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.  

 
చదవండి👉 : పేటీఎంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement