న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు.
నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్‌బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్‌ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment