Paytm CEO Vijay Shekhar Sharma
-
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్‌లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్‌ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్‌తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్‌లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు పోతాయేమో అని భయపడుతున్నారు. కంపెనీ భవిష్యత్తు గురించి, ఉద్యోగుల ఉద్యోగాల గురించి సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు కోసం ఆర్బీఐతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ ఉన్నతి కోసం పలు బ్యాంకులతో చర్చలు జరపడానికి కూడా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. కంపెనీ సీఈఓ తన ఉద్యోగులతో సమావేశమై.. పేటీఎం కుటుంబంలో ఉద్యోగులు చాలా ముఖ్యమైన భాగమని, వారు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక నుంచి కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా పాటిస్తోందని, కాబట్టి ఉద్యోగులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. -
ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్‌ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. -
చదువు కోసం ఎన్ని కష్టాలో ? పేటీఎం విజయ్ శేఖర్ శర్మ
చదువుకునే రోజుల్లో కాళ్లకి చెప్పులు లేని పేదరికం.. సోదరి పెళ్లి కోసం స్టార్టప్‌ను అమ్మేయాల్సిన నిస్సహాయత..ఇన్‌టైంలో జీవితంలో సెటిల్ కాకపోవడంతో దక్కిన మోస్ట్ అన్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హోదా.. ఇలా ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చి పేటీఎం స్థాపించారు విజయ్ శేఖర్ శర్మ. అడుగడుగునా అడ్డంకులు దాటుకుంటూ ముళ్లదారిలో పయణించి జీవితంలో పైకి వచ్చారాయన. అందుకే ఎదుటి వారి కన్నీళ్లను చూసి చలించిపోతారు. అలా ఎమోషనలైన ఓ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు విజయ్ శేఖర్ శర్మ. ఇటీవల ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిచారు. దీంతో విద్యార్థులు ఎలా ఫీలవుతున్నారో తెలుసుకునేందుకు ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడొక విద్యార్థి కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించడంతో ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆ రిపోర్టర్ అడగగా ‘ తన పేరు స్నేహా అని, రెండేళ్లుగా జరుగుతున్న ఆన్లైన్ క్లాసుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవడం గగనమయ్యేదని.. తన తండ్రికి కళ్లు కనిపించవని.. తనకు ఫోన్ కొనివ్వలేని పరిస్థితి ఉందని.. ఐనప్పటికీ నా చదువు కోసం వారంతా కష్టపడ్డారంటూ తన కుటుంబ నేపథ్యం చెప్పుకొచ్చింది. ఈ రోజు తిరిగి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఈ విద్యార్థిని వివరణ ఇచ్చింది. Very emotional. The journalist handled it so maturely and cheered her up well. 👏🏼👏🏼 https://t.co/mTGzVE9xHC — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 7, 2022 స్టూడెంట్ స్నేహ ఆన్లైన్ క్లాస్ ఇబ్బందుల వీడియోను షేర్ చేసిన విజయ్ శేఖర్ శర్మ.. ఆ బాలికను మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు. సెన్సిబుల్‌గా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టును అభినందించారు. -
వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..!
Paytm Will Not Force Employees To Come To Office: CEO: వర్క్ ఫ్రమ్ హోం రాకతో ఇంటికే పరిమితమైన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రఖ్యాతి గాంచిన పేటీయం వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కీలక వ్యాఖ్యలను చేసింది. ఉద్యోగుల ఇష్టం మేరకే..! భారత్‌లో మరింత విస్తరించేందుకుగాను పేటీఎమ్ సన్నాహాలను చేస్తోంది. అందులో భాగంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఉద్యోగులను నియమించేందుకు పేటీఎమ్ ప్రణాళిలు చేస్తోన్నట్లు పేటీఎమ్ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అక్టోబర్ 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కూడా విజయ్ స్పందించారు. కంపెనీ ఉద్యోగులను వారి అభీష్టం మేరకు ఆఫీసులకు రావచ్చునని వెల్లడించారు. ఆఫీసులకు రావాలా..! వద్దా...! అనేది ఉద్యోగుల ఇష్టమని అన్నారు. ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాలని కంపెనీ బలవంతం చేయదని విజయ్ పేర్కొన్నారు. చదవండి: ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా? ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్..! పేటీఎమ్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చింది. దీంతో పేటీఎమ్ సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించనుంది. పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆనందంతో డ్యాన్స్ చేశారు. కాగా కంపెనీ ఐపీవోకు వెళ్తున్న సందర్భంలో మార్కెట్లలో, ఉద్యోగుల్లో పాజిటివిటీ నింపాలనే ఉద్దేశ్యంతో పేటీఎమ్ ఉద్యోగులకు 100 శాతం ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్‌ను ఇచ్చి ఉండోచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పేటీఎమ్ ఐపీవో ధర ఎంతంటే..! 11వేల మంది ఉద్యోగులను కల్గి ఉన్న పేటీఎమ్ వచ్చే నెల నవంబర్ 8న ఐపీవోను ప్రారంభించనుంది. పేటీఎమ్ ఒక్కో షేర్ విలువ సుమారు రూ. 2,080-2,150 ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: జియో ఫోన్ కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే -
‘పేటీఎం మనీ’పై ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్
న్యూఢిల్లీ: పేటీఎంకు చెందిన పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌పై ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ (ఎఫ్‌అండ్‌వో) సేవలను అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే 18 నెలల నుంచి 24 నెలల కాలంలో రోజువారీ రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ బుధవారం ప్రకటించింది. పేటీఎం మనీ ఇప్పటికే స్టాక్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఐపీవో, ఎన్పీఎస్, డిజిటల్ బంగారం సాధనాల్లో పెట్టుబడుల సేవలను అందిస్తోంది. 10 కోట్ల మంది భారతీయులకు వెల్త్ సేవలను (సంపద) అందించడమే తమ లక్ష్యమని, ఎఫ్‌అండ్‌వో సేవలను ప్రారంభించిన సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవల ఆరంభం దీన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. ‘‘మొదటిసారి మొబైల్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తిని రూపొందించాము. ఎంతో సులభంగా, తక్కువ ధరతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా చిన్న పట్టణాల్లోకి బలంగా చొచ్చుకుపోతాము’’ అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ట్రేడ్‌కు రూ.10 చార్జీ అన్ని రకాల ఎఫ్‌అండ్‌వో లావాదేవీలకు కేవలం రూ.10 చార్జీగా (ఒక ఆర్డర్‌కు) పేటీఎం వసూలు చేయనుంది. క్యాష్ విభాగంలోనూ ఇంట్రాడే ట్రేడ్స్‌కు రూ.10, డెలివరీ ట్రేడ్స్‌ను ఉచితంగా ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. 18–24 నెలల్లో రోజువారీగా మిలియన్ ట్రేడ్స్‌ను, రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవలను తొలుత 500 మంది యూజర్లకు అందిస్తామని.. వచ్చే రెండు వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. -
స్కామ్ మెసేజ్‌లతో జాగ్రత్త..
ముంబై: స్కామ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండడం ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కస్టమర్లకు పేటీఎం అధినేత విజయ్‌శేఖర్ శర్మ కోరారు. కంపెనీ అధికారులమంటూ మోసగాళ్లు పంపే ఈ మెయిల్స్, మెసేజ్‌ల వలలో పడిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘మీ పేటీఎం అకౌంట్ బ్లాకింగ్‌కు సంబంధించి లేదా కేవైసీ చేయాలని కోరుతూ ఎటువంటి మెస్సేజ్ వచ్చినా నమ్మకండి. వీరంతా మోసగాళ్లు’’ అని ట్విట్టర్ వేదికగా శేఖర్ శర్మ కోరారు. పేటీఎం కస్టమర్లు కొందరికి మోసగాళ్లు పంపిన ఎస్ఎంఎస్ ఫొటోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘కొంత సమయం పాటు మీ పేటీఎం అకౌంట్లోని నగదును నిలిపివేస్తున్నాం. పేటీఎం కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది’’ అంటూ సంబంధిత ఎస్ఎంఎస్లో పేర్కొన్న విషయాన్ని ఆయన తెలిపారు. వ్యక్తిగత వివరాలను పొందేందుకు మోసగాళ్లు ఈ పనిచేస్తున్నారని, వారి మోసానికి గురికావద్దని సూచించారు. గడిచిన మూడు నెలల్లో వందలాది పేటీఎం కస్టమర్లు ఈ తరహా ఎస్ఎంఎస్లను చూసి కంపెనీ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయగా, కొందరు ఆర్బీఐ అంబుడ్స్‌మన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేవైసీ చేసేందుకు గాను మొబైల్ లేదా డెస్క్‌టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరడం ద్వారా.. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్న అనంతరం అందులోని డేటాను తస్కరించడంతోపాటు, పేటీఎం వ్యాలెట్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి నగదును కూడా తరలించుకుపోతారు. -
కేరళ వరదలు: పేటీఎం జిమ్మిక్కు, బాస్‌పై ఆగ్రహం
సాక్షి, ముంబై: ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ ప్రజలకు ఆదుకునేందుకు మేము సేతం అంటూ చిన్నా పెద్దా అంతా తమ వంతుగా తోచిన విరాళాన్ని ప్రకటిస్తున్నారు. అయితే పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ చేసిన డొనేషన్ విమర్శలకు తావిచ్చింది. ట్వీట్లు కాదు, విరాళాలు కావాలంటూ బాలీవుడ్ నటులపై ఆగ్రహించిన నెటిజన్లు తాజాగా బిజినెస్ టైకూన్‌పై విమర్శలు గుప్పించారు. వివరాల్లోకి వెడితే విజయ్ శేఖర్శర్మ కేరళ బాధితులపట్ల తన ఔదార్యాన్ని ప్రకటించారు. కేరళీయులకు 10వేల రూపాయలు దానం చేశానంటూ, ఒక స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేశారు. అలాగే బాధితులకు అందరూ సాయపడాలంటూ అభ్యర్థించారు. అంతేకాదు పేటీఎం యాప్ ద్వారా డొనేషన్లు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అక్కడితో ఆగితే పెద్దగా ఎవరూ స్పందించేవారు కాదేమో. ఎందుకంటే తన సంస్థ ఘన విజయం, సాధించిన భారీ ఆదాయంపై ఆయన మరో ట్వీట్ చేశారు. కేవలం 48 గంటల్లో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యూజర్లను అదనంగా సాధించామనీ, పేటీఎం ఆదాయం 10 కోట్ల రూపాయలను అధిగమించిందని పేర్కొన్నారు. అదీ కేరళ వరద సహాయ ట్రాన్సాక్షన్స్తో కలిపి ఈ మొత్తాన్ని సాధించినట్టు ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం తారా స్థాయికి చేరింది. బిలియనీర్ ఇచ్చే దానం కేవలం 10 వేల రూపాయలా అని కొందరు, ఇదో మార్కెటింగ్ జిమ్మిక్కంటూ మరికొందరు మండిపడ్డారు. ఇదిలావుండగా కేవలం మూడు రోజుల్లో 8 లక్షలకు పైగా వినియోగదారులను సాధించిన పేటీఎం రూ.20 కోట్లను క్రాస్ చేయడం గమనార్హం. కాగా దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా పేటీఎం పెద్ద ఎత్తున లాభాలను సాధించింది. 'పేటీఎం కరో' అంటూ యూజర్లను ఆకర్షించిన సంగతి తెలిసిందే. We are extremely proud to announce that we have received contributions of INR 20 Crore+ in under 3 days, from over 8 lakh Paytm users for #KeralaFloodRelief 🙏 Let’s keep contributing.#IndiaForKerala 🇮🇳 — Paytm (@Paytm) August 19, 2018 Rs. 10K from a billionaire? Not bad to advertise 4 the Paytm app by posting it here & specifically mentioning 2 Paytm app? Don’t follow cheap capitalist hippies. Use any other means excluding Paytm. @vijayshekhar pic.twitter.com/HQo8t1ZEKH — Chaddilectual (@Chaddilectual) August 18, 2018 We are extremely proud to announce that we have received contributions of INR 20 Crore+ in under 3 days, from over 8 lakh Paytm users for #KeralaFloodRelief 🙏 We are extremely proud to announce that we have received contributions of INR 10 Crore+ in less than 48 hours from more than 4 lakh Paytm users across India for #KeralaFloodRelief 🙏#IndiaForKerala 🇮🇳 — Paytm (@Paytm) August 18, 2018 -
రిక్షాలో వచ్చిన సీఈవో.. సీఎం విస్మయం!
-
రిక్షాలో వచ్చిన సీఈవో.. సీఎం విస్మయం!
ట్రాఫిక్ విషయంలో దేశంలో ఏ నగరానికీ పెద్దగా మినహాయింపు లేదు. ఇక లక్నో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నిత్యకృత్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకుంటూనే ఉంటాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలిసేందుకు బయలుదేరిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా ఇలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు కదిలే గత్యంతరం లేకపోవడంతో.. ఓ రిక్షాకార్మికుడు ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు. భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆయనను తన రిక్షాలో ఎక్కించుకొని.. చకచకా తొక్కుతూ ఏకంగా సీఎం నివాసం 5 కాళిదాస్ మార్గ్‌కు తీసుకెళ్లారు. దేశంలోనే టాప్ మొబైల్ వ్యాలెట్ స్టార్టప్ అధినేత ఇలా రిక్షాలో రావడంతో సీఎం అఖిలేశ్ ఒకింత విస్తుపోయారు. దీంతో తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్ సీఈవో విజయ్ రిక్షా సైకిల్లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. రిక్షావాలా జిందాబాద్! పీటీఎం సీఈవోను తన రిక్షాలో కూర్చోబెట్టుకొని సీఎం నివాసానికి తీసుకొచ్చిన మణిరామ్‌కు ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చింది. ఇందుకుగాను అతనికి రూ. 6వేల రివార్డుతోపాటు కొత్త రిక్షా సైకిల్, కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని సీఎం అఖిలేశ్ హామీ ఇచ్చారు. ఇక, రిక్షా సవారీ చేసిన పీటీఎం అధినేత విజయ్.. ఆ కార్మికుడికి నేరుగా డబ్బు ఇచ్చారా? లేక పేటీఎం ద్వారా ఈ-పేమెంట్ చేశారా? అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.