చదువుకునే రోజుల్లో కాళ్లకి చెప్పులు లేని పేదరికం.. సోదరి పెళ్లి కోసం స్టార్టప్‌ను అమ్మేయాల్సిన నిస్సహాయత..ఇన్‌టైంలో జీవితంలో సెటిల్ కాకపోవడంతో దక్కిన మోస్ట్ అన్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హోదా.. ఇలా ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చి పేటీఎం స్థాపించారు విజయ్ శేఖర్ శర్మ. అడుగడుగునా అడ్డంకులు దాటుకుంటూ ముళ్లదారిలో పయణించి జీవితంలో పైకి వచ్చారాయన. అందుకే ఎదుటి వారి కన్నీళ్లను చూసి చలించిపోతారు. అలా ఎమోషనలైన ఓ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు విజయ్ శేఖర్ శర్మ.
ఇటీవల ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిచారు. దీంతో విద్యార్థులు ఎలా ఫీలవుతున్నారో తెలుసుకునేందుకు ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడొక విద్యార్థి కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించడంతో ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆ రిపోర్టర్ అడగగా ‘ తన పేరు స్నేహా అని, రెండేళ్లుగా జరుగుతున్న ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అవడం గగనమయ్యేదని.. తన తండ్రికి కళ్లు కనిపించవని.. తనకు ఫోన్ కొనివ్వలేని పరిస్థితి ఉందని.. ఐనప్పటికీ నా చదువు కోసం వారంతా కష్టపడ్డారంటూ తన కుటుంబ నేపథ్యం చెప్పుకొచ్చింది. ఈ రోజు తిరిగి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఈ విద్యార్థిని వివరణ ఇచ్చింది.
Very emotional. The journalist handled it so maturely and cheered her up well. 👏🏼👏🏼 https://t.co/mTGzVE9xHC
— Vijay Shekhar Sharma (@vijayshekhar) February 7, 2022
స్టూడెంట్ స్నేహ ఆన్‌లైన్ క్లాస్ ఇబ్బందుల వీడియోను షేర్ చేసిన విజయ్ శేఖర్ శర్మ.. ఆ బాలికను మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు. సెన్సిబుల్‌గా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment