పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు పోతాయేమో అని భయపడుతున్నారు. కంపెనీ భవిష్యత్తు గురించి, ఉద్యోగుల ఉద్యోగాల గురించి సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తు కోసం ఆర్‌బీఐతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ ఉన్నతి కోసం పలు బ్యాంకులతో చర్చలు జరపడానికి కూడా సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని సీఈఓ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
కంపెనీ సీఈఓ తన ఉద్యోగులతో సమావేశమై.. పేటీఎం కుటుంబంలో ఉద్యోగులు చాలా ముఖ్యమైన భాగమని, వారు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక నుంచి కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పూర్తిగా పాటిస్తోందని, కాబట్టి ఉద్యోగులు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment