Paytm Will Not Force Employees To Come To Office: CEO: వర్క్ ఫ్రమ్ హోం రాకతో ఇంటికే పరిమితమైన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రఖ్యాతి గాంచిన పేటీయం వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కీలక వ్యాఖ్యలను చేసింది.
ఉద్యోగుల ఇష్టం మేరకే..!
భారత్‌లో మరింత విస్తరించేందుకుగాను పేటీఎమ్ సన్నాహాలను చేస్తోంది. అందులో భాగంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఉద్యోగులను నియమించేందుకు పేటీఎమ్ ప్రణాళిలు చేస్తోన్నట్లు పేటీఎమ్ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అక్టోబర్ 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్‌పై కూడా విజయ్ స్పందించారు. కంపెనీ ఉద్యోగులను వారి అభీష్టం మేరకు ఆఫీసులకు రావచ్చునని వెల్లడించారు. ఆఫీసులకు రావాలా..! వద్దా...! అనేది ఉద్యోగుల ఇష్టమని అన్నారు. ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసులకు రావాలని కంపెనీ బలవంతం చేయదని విజయ్ పేర్కొన్నారు.
చదవండి: ఏటీఎం సెంటర్‌లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్..!
పేటీఎమ్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చింది. దీంతో పేటీఎమ్ సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించనుంది. పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆనందంతో డ్యాన్స్ చేశారు. కాగా కంపెనీ ఐపీవోకు వెళ్తున్న సందర్భంలో మార్కెట్లలో, ఉద్యోగుల్లో పాజిటివిటీ నింపాలనే ఉద్దేశ్యంతో పేటీఎమ్ ఉద్యోగులకు 100 శాతం ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్‌ను ఇచ్చి ఉండోచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
పేటీఎమ్ ఐపీవో ధర ఎంతంటే..!
11వేల మంది ఉద్యోగులను కల్గి ఉన్న పేటీఎమ్ వచ్చే నెల నవంబర్ 8న ఐపీవోను ప్రారంభించనుంది. పేటీఎమ్ ఒక్కో షేర్ విలువ సుమారు రూ. 2,080-2,150 ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: జియో ఫోన్ కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment