కేరళ వరదలు: పేటీఎం జిమ్మిక్కు, బాస్‌పై ఆగ్రహం | Kerala floodsDonatio , Paytm CEO Vijay Shekhar trolled | Sakshi
Sakshi News home page

కేరళ వరదలు: పేటీఎం జిమ్మిక్కు, బాస్‌పై ఆగ్రహం

Published Mon, Aug 20 2018 9:24 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

Kerala floodsDonatio , Paytm CEO Vijay Shekhar trolled  - Sakshi

పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ ప్రజలకు ఆదుకునేందుకు మేము సేతం అంటూ చిన్నా పెద్దా అంతా తమ వంతుగా తోచిన విరాళాన్ని ప్రకటిస్తున్నారు. అయితే పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో  విజయ్ శేఖర్ శర్మ చేసిన డొనేషన్‌ విమర్శలకు తావిచ్చింది. ట్వీట్లు కాదు, విరాళాలు కావాలంటూ బాలీవుడ్‌ నటులపై ఆగ్రహించిన నెటిజన్లు తాజాగా బిజినెస్‌ టై​కూన్‌పై విమర్శలు గుప్పించారు. 

వివరాల్లోకి వెడితే విజయ్‌ శేఖర్‌శర్మ కేరళ బాధితులపట్ల తన  ఔదార్యాన్ని ప్రకటించారు. కేరళీయులకు 10వేల రూపాయలు దానం చేశానంటూ, ఒక స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌ చేశారు. అలాగే బాధితులకు అందరూ సాయపడాలంటూ అభ్యర్థించారు. అంతేకాదు పేటీఎం యాప్‌ ద్వారా డొనేషన్లు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అక్కడితో ఆగితే పెద్దగా ఎవరూ స్పందించేవారు కాదేమో. ఎందుకంటే తన సంస్థ ఘన విజయం, సాధించిన భారీ ఆదాయంపై ఆయన మరో ట్వీట్‌ చేశారు. కేవలం 48 గంటల్లో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల యూజర్లను అదనంగా సాధించామనీ, పేటీఎం ఆదాయం 10 కోట్ల రూపాయలను అధిగమించిందని పేర్కొన్నారు.  అదీ  కేరళ వరద సహాయ ట్రాన్సాక్షన్స్‌తో కలిపి ఈ మొత్తాన్ని సాధించినట్టు ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం తారా స్థాయికి చేరింది. బిలియనీర్‌ ఇచ్చే దానం కేవలం 10 వేల రూపాయలా అని కొందరు, ఇదో మార్కెటింగ్‌ జిమ్మిక్కంటూ మరికొందరు మండిపడ్డారు. ఇదిలావుండగా కేవలం మూడు రోజుల్లో 8 లక్షలకు పైగా వినియోగదారులను సాధించిన పేటీఎం రూ.20 కోట్లను క్రాస్‌ చేయడం గమనార్హం.

కాగా  దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా పేటీఎం పెద్ద ఎత్తున లాభాలను సాధించింది. 'పేటీఎం కరో' అంటూ యూజర్లను  ఆకర్షించిన సంగతి తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement