ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm)కి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది.
దీనిపైన పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ కీలక ప్రకటనలు చేశారు. మీ ఫెవరేట్ పేటీఎం యాప్ ఎప్పటిలాగే పనిచేస్తుందని, తమకు మద్దతు తెలిపిన యూజర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువమంది దీనిని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ చాంపియన్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు.
రెండు రోజుల్లో 40 శాతం పడిన షేర్ ధర
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ఫలితంగా పేటీఎం తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, దీంతో సంస్థ షేర్స్ కూడా రెండు రోజుల్లో 40 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం 487 రూపాయల దగ్గర షేర్ డ్రేట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఒక్క రోజే పేటీఎం షేరు 20 శాతం అంటే 121 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 1వ తేదీ కూడా 20 శాతం పడిపోయింది. జనవరి 31వ తేదీ 761 రూపాయలుగా ఉన్న ఒక్కో షేరు ధర.. ఫిబ్రవరి 2వ తేదీన 487 రూపాయలకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో నిన్న 19.99% నష్టపోయి లోయర్ సర్క్యూట్ రూ.609కు చేరి, అక్కడే ముగిసింది. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువ రూ.9,646.31 కోట్లు ఆవిరై రూ.38,663.69 కోట్లకు పరిమితమైంది.
To every Paytmer,
— Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024
Your favourite app is working, will keep working beyond 29 February as usual.
I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full…
Comments
Please login to add a commentAdd a comment