సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయం డిజిటల్ చెల్లింపుల దిగ్గజ సంస్థ పేటీఎం తన యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో కోవిడ్-19 వాక్సిన్ లభ్యత వివరాలను అందించేలా తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తద్వారా కరోనా వ్యాక్స్‌న్ స్లాట్స్, లభ్యత వివరాలు వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సంబధిత స్లాట్స్ అందుబాటులోకి వచ్చినపుడు తన వినియోగ దారులను అలర్ట్ చేస్తుంది కూడా.
తమ యూజర్లు కరోనా వ్యాక్సిన్ స్లాట్ వివరాలను తెలుసుకునేందుకు ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ అనే ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చామని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. దీని ద్వారా వినియోగదారులు టీకా స్లాట్ బుక్ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతంలో టీకా స్లాట్లు అందుబాటులో ఉన్నప్పుడు అలర్ట్స్ కూడా పొందవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లభించే వ్యాక్సిన్ స్లాట్‌లను కంపెనీ రియల్ టైం ట్రాక్ చేస్తోందని, సుమారు 780 జిల్లాలలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాగా దేశంలో కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ 3 లక్షలకు పైగా కొత్త కేసులతో బెంబేలెత్తిస్తున్న కరోనా, గురువారం మరోసారి నాలుగు లక్షల మార్క్‌ను అధిగమించింది. దీంతో మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం లాంటి నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడంతో పాటు అర్హులైన వారంతా కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు
We are launching a new tool for users to find COVID Vaccine slots and set for alerts when new slots open up for their locality. @Paytm checks for availability real-time and alerts users via Paytm Chat when a new slot opens up.https://t.co/WvJa7CRxxO
— Vijay Shekhar Sharma (@vijayshekhar) May 6, 2021
Pls spread awareness.
Comments
Please login to add a commentAdd a comment