![Harsh Goenka Says To Fulfill Your Dream To Preserve Hardwork Only - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/10/Vijaya.jpg.webp?itok=8KxO5xft)
మనం జీవితంలో మంచి స్థాయిలోకి రాలేకపోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటాం. కానీ మనలాగే రకరకాల సమస్యల మధ్య నలిగిపోతునప్పటికీ అత్యున్నత స్థాయికి చేరుకున్నావారు ఎందురో ఉన్నారు. కానీ వాళ్లను మనం ఆదర్శంగా తీసుకుని కష్టపడటానికి ఇష్టంపడం. అచ్చం అలాంటి సందేశాన్ని వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా యువతకు తెలియజేశారు.
(చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం)
అసలు విషయంలోకెళ్లితే....వ్యాపార దిగ్గజం ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చరిత్రలో అతిపెద్ద ఐపీఓని ప్రారంభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంలే కుటుంబ నేపథ్యం, గొప్ప ఆంగ్ల పరిజ్ఞానం లేదా డబ్బు అవసరం లేదని చెప్పడానికి అతని కథే నిదర్శనం అంటూ విజయ్ శర్మని కొనియాడరు.
డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో పబ్లిక్ ఇష్యూ ఇన్వెస్టర్(ఐపీవో) ప్రారంభించిన నేపథ్యంలో గోయోంకా విజయ్ శేఖర్ శర్మను ప్రసంశిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు దాదాపు ఐదేళ్ల క్రితం డీమోనిటైజేషన్ ప్రకటించినప్పుడు శ్రీ శర్మ దాదాపు ఆనందంతో డ్యాన్స్ చేశాడన్న విషయాన్ని కూడా గోయెంకా ట్విట్టర్‌లో వెల్లడించారు.
(చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment