ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందించే వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోనుంది. యాపిల్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో టిమ్‌కుక్ వేతనం తగ్గించాలని చర్చకు వచ్చింది. షేర్ హోల్డర్లతో జరిపిన సమావేశం అనంతరం వేతన తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
పెట్టుబడిదారుల అభిప్రాయం మేరకు తన వేతనాన్ని సర్దుబాటు చేయమని కుక్ స్వయంగా అభ్యర్థించారు.కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఆయన వేతనం 40శాతం పైగా తగ్గించి 49 మిలియన్లను మాత్రమే ముట్టజెప్పనుంది.
2023లో కుక్‌కు ఇచ్చే శాలరీ మార్పులు, యాపిల్ పనితీరుతో ముడిపడి ఉన్న స్టాక్ యూనిట్ల శాతం 50 నుంచి రానున్న రోజుల్లో 75శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2022లో కుక్ 99.4 మిలియన్ల మొత్తాన్ని శాలరీ రూపంలో తీసుకోగా, ఇందులో 3 మిలియన్ల బేసిక్ శాలరీ, సుమారు 83 మిలియన్లు స్టాక్ అవార్డ్‌లు, బోనస్‌లు ఉన్నాయి.
కుక్ వేతనంపై యాపిల్ సంస్థ స్పందించింది. సంస్థ అసాధారణమైన పనితీరు, సీఈవో సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, యాపిల్ సంస్థ టిమ్ కుక్‌కు ఇచ్చే ప్యాకేజీపై వాటాదారులకు అభ్యంతర వ్యక్తం చేశారు. అదే సమయంలో కుక్ పట్ల యాపిల్ ప్రదర్శిస్తున్న విధేయతపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో టిమ్‌కుక్ శాలరీ విషయంలో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో ప్రముఖ అడ్వైజరీ సంస్థ ఐఎస్‌ఎస్ (Institutional Shareholder Services) సైతం 2026లో టిమ్‌కుక్ రిటైర్ కానున్నారు. అప్పటివరకు ఈ ప్రోత్సహాకాలు ఇలాగే కొనసాగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment