
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈఓ అశిష్‌కుమార్ చౌహాన్ నియామకానికి షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. ‘‘ఆగస్టు 11వ తేదీన నిర్వహించిన అసాధారణ స్వర్వసభ్య సమావేశం(ఈఓజీఎం)లో చౌహాన్ నియామకానికి మద్దతుగా 99.99 శాతం ఓట్లతో షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు’’ అని ఎక్స్‌ఛేంజ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్‌ఎస్‌ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 16తో ముగిసిన నేపథ్యంలో., ఈ పదవికి చౌహాన్ ఎంపికయ్యారు. సెబీ జూలై 18న ఆమోదం తెలిపింది. అదే నెల 27 తేదీన ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు.
చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!