అపోలో టైర్స్‌ ఎండీకి షాక్‌ ‌: వేతనాల కోత | Apollo Tyres Cuts Kanwars Pay After Shareholder Rebuff | Sakshi
Sakshi News home page

అపోలో టైర్స్‌ ఎండీకి షాక్‌ ‌: వేతనాల కోత

Published Tue, Nov 13 2018 5:35 PM | Last Updated on Tue, Nov 13 2018 5:35 PM

Apollo Tyres Cuts Kanwars Pay After Shareholder Rebuff - Sakshi

సాక్షి,ముంబై: దేశంలోనే అతిపెద్ద టైర్ల పరిశ్రమ అపోలో టైర్స్ కంపెనీకి అపోలో టైర్స్ లిమిటెడ్  ఛైర్మన్ ఒంకార్ కన్వర్,  ఆయన కుమారుడు,  ఎండీ, కంపెనీ ఉపాధ్యక్షుడు నీరజ్ కన్వర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.  కంపెనీ వీరికి  చెల్లించే చెల్లింపుల్లో 30శాతం కోత పడింది.  అలాగే  మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ పునః నియామకాన్ని కూడా కంపెనీ  తిరస్కరించింది.

అపోలో టైర్స్ బోర్డుకు చెందిన  నామినేషన్స్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి వారి  మొత్తం పరిహారాన్ని 30 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రమోటర్ల వేతనాలు పన్ను చెల్లించే ముందు లాభంలో 7.5 శాతం పరిమితి ఉండాలని  కమిటీ సిఫార్సు చేసింది. పనితీరు ఆధారిత వేతనం మొత్తం పరిహారంలో సుమారు 70 శాతంగా ఉండాలి, ప్రమోటర్ల వార్షిక ఇంక్రిమెంట్స్  కూడా కంపెనీ సీనియర్ నిపుణులకి అనుగుణంగా ఉండాలని ప్యానెల్‌  స్పష్టం చేసింది.

అపోలో టైర్స్ ఎండీ నీరజ్ కన్వర్ కొనసాగింపునకు కంపెనీలో మైనార్టీ వాటా కలిగిన షేర్ హోల్డర్స్  ససేమిరా అన్నారు. ఈ షాకింగ్‌ పరిణామంతో కంపెనీలో మేజర్ వాటా కలిగిన నీరజ్ కు షేర్‌ హోల్డర్స్ చేతిలో అతి పెద్ద ఒటమి ఎదురైనట్టైంది. నీరజ్  వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పరిహారాలను తీసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఎండీగా కొనసాగడానికి అర్హుడు కాదని అపోలో టైర్స్  షేర్ హోల్డర్స్ అభిప్రాయ పడ్డారు. సెప్టెంబరు 12న జరిగిన ఓటింగ్ లో కంపెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్‌ ఇన్వెస్టర్లు కూడా నీరజ్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

2016 లో రు. 30 కోట్లు హౌజ్ అలవెన్స్‌గా తీసుకున్న నీరజ్ 2017లో ఆయన నిర్వాహణలో కంపెనీ లాభాలు గత సంవత్సరం 34 శాతం తగ్గి రు.622 కోట్లకే పరిమితమైనప్పటికీ , 41 శాతం పెంపుతో 42.8 కోట్లను డ్రా చేశారు నీరజ్‌. పే-టు-లాభం నిష్పత్తి పరంగా నీరజ్‌కు అందినపరిహారం దాదాపు రెట్టింపు అయ్యింది. అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరానికి తండ్రీకొడు కుల జీతం-లాభం నిష్పత్తి రెండింతలైందిట. ఇదే  షేర్ హోల్డర్స్ లో నీరజ్ పై అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement