శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ఘట్టం ముగింపు దశకు చేరుకోగా పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ మద్దతుదారులకే దక్కేలా చూడాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం డీసీసీబీ, డీఎస్‌ఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లా పరిశీలకులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్ గంటన్నర పాటు భేటీ అయ్యారు.
శనివారం జరిగే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మద్దతుదారులే విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో వారి ఎంపిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు.
జిల్లాలకు పరిశీలకులు..
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్‌ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు శుక్రవారం రాత్రే జిల్లాలకు బయ ల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, క్యాం పుల్లో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు శనివారం ఉదయం 7 గంటలకల్లా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వీరితో ఉదయం 7 గంటలకు పార్టీ పరిశీలకులు సమావేశమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన వారికి మద్దతు పలకాలని కోరతారు.
సీల్డ్ కవర్లను తెరిచి పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగి న తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. సంఖ్యా బలం పరంగా టీఆర్‌ఎస్‌కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
సామాజిక సమీకరణాల కోణంలో..
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవులకు సంబంధించి పార్టీ సమీకరణాలు, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరా రుచేసినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొండూరు రవీందర్‌రావును కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఖరారు చేశారు. వీరితోపాటు పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), మార్నేని రవీందర్‌రావు (వరంగల్), అడ్డి బోజారెడ్డి లేదా శరత్‌చంద్రారావు (ఆదిలాబాద్), మనోహర్‌రెడ్డి (రంగారెడ్డి), గొంగిడి మహేందర్‌రెడ్డి(నల్లగొండ), ఎం.దేవేందర్‌రెడ్డి లేదా చిట్టి దేవేందర్‌రెడ్డి (మెదక్), మనోహర్ (మహబూబ్‌నగర్), కూరాకుల నాగభూషణం లేదా తూళ్లూరు బ్రహ్మయ్య (ఖమ్మం) పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీఎంఎస్‌కు సంబంధించి మల్కాపు రం శివకుమార్ (మెదక్), శ్రీనివాస్‌గౌడ్ (నిజామాబాద్), పి.క్రిష్ణారెడ్డి (రంగారెడ్డి) పేర్లున్నట్లు సమా చారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టు కుని డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం ఉదయం జాబితాపై స్పష్టత రానున్నది.
Comments
Please login to add a commentAdd a comment