DCMS
-
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
డీసీఎంఎస్ ద్వారా చేనేత వస్త్రాల విక్రయం
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఎక్కువగా వినియోగించే ధోవతీలు, టవల్స్, లుంగీలు, బెడ్ షీట్లు, కాటన్, చేనేత చీరలను అందుబాటు ధరల్లో ఉంచేందుకు డీసీఎంఎస్‌తో కలిసి పనిచేస్తామని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ విషయమై ఆప్కో, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సంస్థల మధ్య సోమవారం సమాలోచనలు జరిగాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని డీసీఎంఎస్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధతో సమావేశమై చర్చించామని పేర్కొన్నారు. మార్కెటింగ్ సొసైటీల ద్వారా రైతులకు ఆప్కో వస్త్రాలు విక్రయించే ప్రకియను పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు. -
రైతుకు అండ: పలుగు, పార, ట్రాక్టర్ అన్నీ ఒకేచోట..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గడ్డపారలు, నాగళ్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) వంటి చిన్నా పెద్దా వ్యవసాయ పరికరాలతో పాటు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. ఇలా సాగుకు అవసరమైనవన్నీ ఒకే చోట రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సమీకృత రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘వన్ స్టాప్.. వన్ షాప్.. వన్ సొల్యూషన్..’’ పేరుతో పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. కార్పొరేట్ కంపెనీ షోరూంలను తలదన్నే రీతిలో అన్ని హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని సంగాపురం రోడ్డులో సుమారు రెండు ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి వచ్చింది. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం.. రైతులకు అవసరమైన చిన్న చిన్న పని ముట్లు, ఆధునిక యంత్ర పరికరాలు, ఇతర ఉత్పత్తులన్నిటినీ మార్కెట్ ధర కంటే తక్కు వకే రైతులకు విక్రయిస్తారు. ఇందుకోసం బహుళ జాతి కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని డీసీఎంఎస్ నిర్ణయించింది. మహీంద్రా, జాన్‌డీర్ వంటి ట్రాక్టర్ కంపె నీలు, పురుగుల మందులు, యంత్ర పరికరాలు ఉత్పత్తి చేసే ఇతర సంస్థల నుంచి నేరుగా యంత్రాలను కొనుగోలు చేసి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచుతారు. ఈ కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.8.50 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్సీడీసీ (నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.5 కోట్లు గ్రాంట్ రూపంలో తీసుకుంటున్నారు. డీసీఎంఎస్ నుంచి రూ.కోటిన్నర వినియోగించాలని భావిస్తున్నారు. మిగతా రూ.2 కోట్లు పత్యేక అభివృద్ధి నిధుల కింద మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు సహకార శాఖ నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ రాగా, నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. నిధులు మంజూరైన వెంటనే పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. రైతుల్లో అవగాహనకు ప్రత్యేక ఏర్పాట్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యంత్రాలు, ఆధునాతన యంత్ర పరికరాల వినియోగం, సాగు వ్యయాన్ని తగ్గించే పద్ధతులు, దిగుబడి పెంచేందుకు ఉపయుక్తమైన పురుగుల మందులు, ఇతర ఉత్పత్తుల వాడకం...ఇలా పలు అంశాలపై ఈ కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీసీఎంఎస్ నిర్ణయించింది. నిధులు మంజూరైన వెంటనే పనులు ఈ కేంద్రంలో సాగుకు అవసరమైనవన్నీ లభిస్తాయి. రైతులు ఒక్కోదాని కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి వచ్చే ఆధునిక యంత్ర పరికరాలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్‌లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం పనులు.. నిధులు సమకూరిన వెంటనే ప్రారంభిస్తాం. - మల్కాపురం శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ -
బడ్జెట్లో జిల్లా పరిషత్‌లకు రూ.320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా పరిషత్ చైర్మన్లు ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా కొంత వరకు నిధుల కేటాయింపులో అలసత్వం జరిగిన మాట వాస్తవమే. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.320 కోట్లు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎన్నో అధికారాలు ఉన్నా.. చిన్నా చితకా పనులను కూడా మంజూరు చేసే పరిస్థితి లేకపోవడాన్ని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో పాటు పలువురు చైర్మన్లు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో జిల్లా పరిషత్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంకు ఉంటుంది. వారి కోసం ఇప్పటి వరకు లేని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏదైనా ఆలోచిస్తాం. నాలుగు రోజుల్లో ప్రగతి భవన్లో జిల్లా పరి షత్ చైర్మన్లతో కలసి భోజనం చేసి.. ప్రత్యే కంగా సమావేశమవుతా. జెడ్పీ చైర్మన్లకు ప్రత్యేక క్వార్టర్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తాం’అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. చదవండి: (నిధులెట్లా.. 2021–22 బడ్జెట్ కూర్పుపై సీఎం కసరత్తు) డీసీఎంఎస్‌లు వారధిగా పనిచేయాలి.. ‘ప్రభుత్వానికి, రైతులకు మధ్య జిల్లా సహకార మార్కెటింగ్ (డీసీఎంఎస్) సొసైటీలు వారధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. జవహర్లాల్ నెహ్రూ హయాంలో పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక గ్రాంటును కూడా ఇస్తుంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మెదక్ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ నేతృత్వంలో ఉమ్మడి 9 జిల్లాల చైర్మన్లు తెలంగాణ భవన్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రైతులకు ట్రాక్టర్లు, ఎరువులు తదితరాలు అందజేయడంలో డీసీసీబీలతో కలసి డీసీఎంఎస్‌లు పనిచేయాలన్నారు. డీసీఎంఎస్‌ల ద్వారా రైతులకు సేవ చేయడంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ లభించదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్) ఐదు గంటలకు పైగా.. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఐదు గంటలకు పైగా గడిపారు. మధ్యాహ్నం 2.15కు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ 4.15 వరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లతో సుమారు గంటన్నర పాటు వేర్వేరుగా సమావేశమయ్యారు. జెడ్పీ చైర్మన్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిధులు, ఇతర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కాగా, సమావేశం ప్రారంభానికి ముందు నాగార్జునసాగర్ దివంగత శాసన సభ్యుడు నోముల నర్సింహయ్య చిత్ర పటం వద్ద సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలసి నివాళి అర్పించారు. మొత్తం 299 మందిని ఆదివారం జరిగిన రాష్ట్ర సమావేశానికి ఆహ్వానించగా, ఒకరిద్దరు మినహా మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ హాజరైనట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆ నేతలతో ప్రత్యేక భేటీ? ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇటీవలి కాలంలో ప్రకటనలు చేసిన మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎంను ప్రత్యేకంగా కలసినట్లు తెలిసింది. అయితే ఈ భేటీ వివరాలు వెల్లడికాలేదు. -
త్వరలోనే రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మందగమనం ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల సంఘటిత శక్తిని వారి సంక్షేమానికి ఉపయోగపడేలా కొత్తగా ఎన్నికైన సహకార సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన జిల్లా కేంద్ర సహకార సంఘాలు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) చైర్మన్లు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో భేటీ అ య్యారు. సహకార ఎన్నికలను సవాల్‌గా తీసుకుని టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించిన మంత్రులను కేటీఆర్ అభినందించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 48 శాతం మేర ప్రాతినిథ్యం కల్పించామని చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ, మహబూబ్‌నగర్‌లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని చైర్మన్లుగా ఎంపిక చేసిట్లు గుర్తు చేశారు. సహకార ఎన్నికల్లో రిజర్వేషన్లు లేకున్నా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బలహీన, బడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించేలా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ఖరారు చేశారన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా రైతు సంక్షేమం: ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నందునే రాష్ట్రంలోని 906 సహకార సంఘాల్లో 94 శాతానికి పైగా తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రైతు బీమా, రైతుబం ధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేంద్ర అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొందని ఆరోపించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకే
-
సహకార పీఠాలన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార సంఘాల మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శనివారం ముగిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులన్నీ ఏకగ్రీవం కాగా అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే జిల్లా సహకార పీఠాలను కైవసం చేసుకున్నారు. సహకార ఎన్నికలకు తొలిమెట్టుగా పేర్కొనే పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలు మొదలుకొని ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల వరకు పార్టీ మద్దతుదారులే గెలుపొందేలా టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వచ్చింది. పీఏసీఎస్ డైరెక్టర్లు, చైర్మన్లు మొదలుకొని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎంపిక వరకు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు క్రియాశీల పాత్రపోషించారు. అయితే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పార్టీలోనే అంతర్గత పోటీ నెలకొనడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. తొమ్మిది డీసీసీబీలకుగాను ఆరు జిల్లాల్లో ఓసీలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో బీసీ, ఆదిలాబాద్‌లో ఎస్సీ కేటగిరీకి చైర్మన్ పదవి దక్కింది. డీసీఎంఎస్‌లలోనూ ఆరుగురు ఓసీలతోపాటు నల్లగొండ, నిజామాబాద్‌లో బీసీ, వరంగల్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతను చైర్మన్ పదవి వరించింది. పరిశీలకుల సమక్షంలో అభ్యర్థుల ప్రకటన... డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు శనివారం ఉదయం 9 గంటలకు నోటిఫికేషన్ వెలువడగా క్యాంపుల్లో ఉన్న టీఆర్ఎస్ మద్దతుదారులు అంతకు రెండు గంటల ముందే ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సీల్డ్ కవర్లు అందుకున్న పార్టీ పరిశీలకులు శనివారం ఉదయం డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. సంబంధిత జిల్లా మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత సీల్డ్ కవర్లలో ఉన్న పేర్లను పార్టీ పరిశీలకులు వెల్లడించి నామినేషన్ల ప్రక్రియను సమన్వయం చేశారు. అయితే ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లో డీసీసీబీ చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో అవకాశం దక్కని ఆశావహులను మంత్రులు బుజ్జగించారు. కొందరికి వైస్ చైర్మన్ పదవి దక్కగా అవకాశం దక్కని నేతలకు ఇతరత్రా అవకాశం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని డీసీసీబీ చైర్మన్ పదవులకు ఆదిలాబాద్‌లో నామ్‌దేవ్ (ఎస్సీ), మహబూబ్‌నగర్‌లో నిజాంపాషా (బీసీ) పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. మెదక్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డికి అవకాశం లభించలేదు. టెస్కాబ్ చైర్మన్‌గా కొండూరు ఎన్నిక లాంఛనమే డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మ న్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ముగియడం తో అందరి దృష్టి రాష్ట్రస్థాయిలో తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ ఎన్నికపై పడింది. ఈ ఎ న్నికకు సంబంధించి ఈ నెల 2 లేదా 3 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా 5న ఎన్నిక జరగనుంది. టెస్కాబ్ తాజా మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో రవీందర్రావు ఎన్నిక లాంఛనప్రాయంగా కనిపిస్తోంది. -
పార్టీ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ఘట్టం ముగింపు దశకు చేరుకోగా పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ మద్దతుదారులకే దక్కేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం డీసీసీబీ, డీఎస్ఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లా పరిశీలకులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. శనివారం జరిగే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మద్దతుదారులే విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో వారి ఎంపిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలకు పరిశీలకులు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు శుక్రవారం రాత్రే జిల్లాలకు బయ ల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, క్యాం పుల్లో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు శనివారం ఉదయం 7 గంటలకల్లా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వీరితో ఉదయం 7 గంటలకు పార్టీ పరిశీలకులు సమావేశమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన వారికి మద్దతు పలకాలని కోరతారు. సీల్డ్ కవర్లను తెరిచి పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగి న తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కోణంలో.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవులకు సంబంధించి పార్టీ సమీకరణాలు, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరా రుచేసినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొండూరు రవీందర్రావును కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఖరారు చేశారు. వీరితోపాటు పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), మార్నేని రవీందర్రావు (వరంగల్), అడ్డి బోజారెడ్డి లేదా శరత్చంద్రారావు (ఆదిలాబాద్), మనోహర్‌రెడ్డి (రంగారెడ్డి), గొంగిడి మహేందర్‌రెడ్డి(నల్లగొండ), ఎం.దేవేందర్‌రెడ్డి లేదా చిట్టి దేవేందర్‌రెడ్డి (మెదక్), మనోహర్ (మహబూబ్‌నగర్), కూరాకుల నాగభూషణం లేదా తూళ్లూరు బ్రహ్మయ్య (ఖమ్మం) పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీఎంఎస్‌కు సంబంధించి మల్కాపు రం శివకుమార్ (మెదక్), శ్రీనివాస్‌గౌడ్ (నిజామాబాద్), పి.క్రిష్ణారెడ్డి (రంగారెడ్డి) పేర్లున్నట్లు సమా చారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టు కుని డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం ఉదయం జాబితాపై స్పష్టత రానున్నది. -
టీఆర్ఎస్ ‘సహకార’ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: పాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ముగియడంతో ఈ నెల 29న జరిగే చైర్మన్ ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ స్థానాలకు మంగళవారం నామినేషన్లు స్వీకరించగా టీఆర్ఎస్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ మినహా ఇతర జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాలను పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తుండటంతో పదవులకు బహుముఖ పోటీ నెలకొంది. జిల్లాల వారీగా డైరెక్టర్ల స్థానాలకు పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. చైర్మన్ పదవులకు కూడా పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు దాదాపు అందరూ పార్టీ మద్దతుదారులే కావడంతో చైర్మన్ పదవులు అన్ని టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి. జిల్లాల వారీగా చైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధిత జిల్లా మంత్రులు చర్చించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముంది. క్యాంపులకు తరలిన డైరెక్టర్లు డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలకు ఎన్నికైన డైరెక్టర్లను మంగళవారం రాత్రి పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. గోవా, బెంగళూరుతో పాటు తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఈ నెల 29న ఉదయం పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆశావహుల జాబితాను రూపొందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ మేరకు తాము సహకార ఎన్నికల బరిలోకి దిగినట్లు కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన వారినే చైర్మన్లుగా ఎన్నుకునేలా జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి చర్చల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, తుది జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
డీసీసీబీ, డీసీఎంఎస్‌లన్నీ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల మేనేజింగ్ కమిటీ సభ్యుల (డైరెక్టర్ల) పదవులు మంగళవారం ఎన్నికలు జరగకుండానే అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవన్నీ ఏకగ్రీవమైనట్లు తెలంగాణ సహకార శాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఒక ప్రకటనలో వెల్లడించారు. టీఆర్ఎస్కు చెందిన వారే ఎక్కువ కైవసం చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయని ఆమె తెలిపారు. దీని కోసం ఆ రోజు నామినేషన్లు స్వీకరిస్తామని, పరిశీలన అనంతరం రహస్య విధానంలో ఓటింగ్ జరిపి ఎన్నుకుంటామన్నారు. కాగా డీసీసీబీలకు 20 మంది చొప్పున గ్రూప్ ఏలో 16, గ్రూప్ బీలో నలుగురు, అలాగే డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున గ్రూప్ ఏలో ఆరుగురు, గ్రూప్ బీలో నలుగురు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు డైరెక్టర్ల పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. 9 డీసీసీబీల్లో 180 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్ డైరెక్టర్ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్ పదవులకు నామినేషన్లు వేయాల్సి ఉండగా, 16 డైరెక్టర్ పదవులకు రిజర్వుడ్ సభ్యులు లేక నామినేషన్లు దాఖలుకాలేదు. మిగిలిన వాటికి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు వేశారు. అయితే మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నామినేషన్ల ఉపసంహరణతో అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌లు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రిజర్వుడ్ స్థానాలకు కొన్నిచోట్ల సభ్యులు లేకపోవడంతో అన్ని డీసీసీబీల్లోని 180 డైరెక్టర్ పదవులకుగాను, 147 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇక అన్ని డీసీఎంఎస్‌లకు 90 మంది డైరెక్టర్ పదవులకుగాను, 74 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ఇదిలావుండగా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్ డైరెక్టర్ పదవులకు ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించే అవకాశముంది. సంబంధిత చైర్మన్లు, వైస్ చైర్మన్లు కోరితే వాటికి ఎన్నిక జరుగుతుందని సహకారశాఖ అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర తెలిపారు. 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక.. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడో తేదీన జారీ చేస్తామని సహకార ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 904 ప్యాక్స్లకు ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్న అనంతరం, వారు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకున్నారు. -
జిల్లాలో ఎన్నికలు..టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ
సాక్షి, ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష పదవి ఎవరినీ వరిస్తుందనే అంశం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ రేపుతుండగా.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాల ఎన్నికకు ఈనెల 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఎన్నికల ప్రక్రియను ఈనెల 21వ తేదీన ప్రారంభించి.. 29వ తేదీ వరకు ముగించాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. 28వ తేదీన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) డైరెక్టర్ల ఎన్నిక, 29వ తేదీన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య జిల్లా సహకార శాఖ అధికారులు, డీసీసీబీ ఈఓలతో సమావేశమయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో ఓటర్లుగా ఎవరెవరు అర్హులో గుర్తిస్తూ.. తక్షణమే ఓటర్ల జాబితా ఇవ్వాలని.. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులతోపాటు వ్యవసాయేతర సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో డీసీసీబీ, డీసీఎంఎస్‌లో ఓటు కలిగి ఉండే అర్హత ఉన్న సంఘాలు ఎన్ని అనే అంశంపై రాష్ట్ర సహకార శాఖ జిల్లా అధికారులను ఓటర్ల జాబితాతో సహా నివేదిక కోరింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య మరోసారి జిల్లా సహకార శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. 21 డీసీసీబీ డైరెక్టర్ పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. డైరెక్టర్‌గా ఎన్నికైన వారి నుంచి డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.. అలాగే డీసీఎంఎస్ డైరెక్టర్లుగా ఎన్నికైన వారి నుంచి డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 101 పీఏసీఎస్‌లు ఉండగా.. అన్నింటికీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రెండు ములుగు జిల్లాలో.. రెండు మహబూబాబాద్ జిల్లాలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల అధ్యక్షులు డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు డైరెక్టర్లను 192 వ్యవసాయేతర సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌కు 13 మంది డైరెక్టర్లు ఉంటారు.. ముగ్గురు వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. 10 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో 6 సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. నలుగురు వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి ఎన్నుకోబడతారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా సహకార శాఖ అధికారి రాజేశ్వర శాస్త్రి, డీసీసీబీ సీఈఓ వసంతరావు, డీసీఎంఎస్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష పదవులకు హోరాహోరీ అధ్యక్ష పదవులకు హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పటికే పీఏసీఎస్ అధ్యక్షులుగా ఎంపికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏ ప్రాతిపదికన.. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి చెందిన నేతలు, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, రాయల శేషగిరిరావు, బీసీలకు అవకాశం ఇచ్చిన పక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు నేతలు డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం సహకార సంఘ అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, వైరా సహకార సంఘం అధ్యక్షులు బొర్రా రాజశేఖర్ తదితరులు ఈ పదవికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డీసీఎంఎస్ చైర్మన్ పదవికి సైతం ఇదే స్థాయిలో పోటీ నెలకొంది. డీసీసీబీ అధ్యక్ష పదవి దక్కకపోయినా డీసీఎంఎస్ పదవి వరిస్తుందనే ఆశతో కొందరు నాయకులు ఉన్నారు. -
టీడీపీ నేతల పాపాలు.. డెయిరీకి శా‘పాలు’
సాక్షి, ఒంగోలు సబర్బన్: సొంత ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించిన జిల్లా టీడీపీ నాయకులు సహకార రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారు. సహకార రంగం కుదేలవుతోందని సీఎం చంద్రబాబుకు తెలిసినా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పీడీసీసీబీ, డీసీఎంస్‌లో టీడీపీ నేతల పెత్తనం కారణంగా అవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. జిల్లాలో సహకార వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. బాబు ఐదేళ్ల పాలనలో సహకార వ్యవస్థలో ఉన్న ప్రధానమైన సంస్థలన్నీ మూతపడే స్థితికి చేరాయి. సహకార సంఘాలు, సొసైటీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సహకార సంఘాలు బలోపేతమైతే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ అధికార టీడీపీ నాయకులు వారి వ్యాపారాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. కోలుకోలేని స్థితిలో ఒంగోలు డెయిరీ.. జిల్లాలో ప్రధానంగా సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని పాలక మండలి చైర్మన్‌గా వ్యవహరించిన టీడీపీ నేత చల్లా శ్రీనివాసరావు మ్యాక్స్ చట్టంలోకి మార్చి కంపెనీ యాక్టులోకి తీసుకెళ్లాడు. డెయిరీ సొమ్ము రూ.80 కోట్లు కాజేసి ఒట్టిపోయిన గేదెలా తయారు చేశాడు. దేశంలోనే ప్రకాశం జిల్లా పాలకు మంచి గిరాకీ ఉంది. దానికితోడు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రోజూ ఒంగోలు డెయిరీకి 2 లక్షల లీటర్ల పాలు వచ్చేవంటే జిల్లాలో పాడి పరిశ్రమ ఏ విధంగా అభివృద్ది చెందిందో అర్థమవుతుంది. అలాంటి డెయిరీని రూ.80 కోట్లకు పైగా అప్పుల్లోకి కూరుకుపోయేట్టు చేసింది టీడీపీ నాయకులతో కూడిన పాలకమండలి. సుదీర్ఘ కాలం చైర్మన్‌గా ఉన్న చల్లా శ్రీనివాసరావు తన సొంత నిధుల మాదిరిగా డెయిరీ డబ్బును ఖర్చు చేసి చివరకు మూతపడే స్థితికి తీసుకెళ్లాడు. పాలు పోసిన రైతులకు నేటికీ డబ్బు ఇవ్వలేదు. పాలు రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్దారులకు కిరాయిలు ఎగ్గొట్టారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టలేదు. ఫెడరేషన్ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకుని తిరగి గాడిలో పెడదామన్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉద్యోగులకు వేతనం ఇవ్వకపోవడంతో డెయిరీ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అధికారులతో కూడిన పాలక మండలి కూడా డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. రైతులకు ఉపయోగపడని పీడీసీసీబీ ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(పీడీసీసీబీ) పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగ పడే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈ బ్యాంకు పరిధిలో 169 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఉత్సవ విగ్రహాల్లా ఉండిపోయాయి తప్పితే వ్యవసాయ రుణాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. అసలే ఐదేళ్లుగా వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నా కనీసం ఆరుతడి పంటలకు కూడా పంట రుణాలు ఇచ్చే పరిస్థితి పీడీసీసీ బ్యాంకుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంకుకు సంబంధించిన నిధులు బడా బాబులకు అప్పనంగా ఇచ్చి బ్యాంకును నష్టాల్లోకి నెట్టారు. ♦ పీడీసీసీ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల క్రితం స్వయానా ప్రభుత్వమే హామీగా ఉండి ఇంకొల్లు స్పిన్నింగ్ మిల్లుకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇప్పించింది. తర్వాత కాలంలో చంద్రబాబునాయుడి దెబ్బకు స్పిన్నింగ్ మిల్లు మూత పడింది. అయితే ఇచ్చిన అప్పును తిరిగి పీడీసీసీ బ్యాంకుకు ఇప్పించాల్సిన ప్రభుత్వం నేటికీ దాని ఊసే పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బ్యాంకుకు దాదాపు రూ.11 కోట్లు మొండి బకాయి కింద ఉండిపోయింది. ♦ అదే విధంగా ముఖ్యమంత్రి సామాజికవర్గానికే చెందిన పీడీసీసీ బ్యాంక్ పాలక మండలి మాజీ చైర్మన్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తారకరామ డెయిరీ పేరుతో రూ.4 కోట్లు రుణం తీసుకున్నాడు. అది కాస్తా వడ్డీ పెరిగి రూ.7 కోట్లు అయింది. ఆ బాకీ వసూలు ఊసే లేదు. ♦ బ్యాంకులో నకిలీ ఆభరణాలు పెట్టి రూ.2.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆ కుంభకోణం కేసులో కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 4,500 పేజీల నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఆ కుంభకోణం తాలూకు నిధులు ఇప్పటికీ రికవరీ కాలేదు. ♦ జిల్లాలో 169 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) నుంచి రైతులు ప్రయోజనం పొందాల్సి ఉంటే వాటి ఊసే లేదు. కానీ వారోత్సవాల పేరిట రోజుకు రెండు పీఏసీఎస్‌లలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. వాటి వల్ల రైతులకు ఒరగింది మాత్రం శూన్యం. అప్పుల కుప్ప డీసీఎంఎస్ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పరిస్థితి కూడా అంతే. రైతులకు సంబంధించిన వ్యాపారాలు చేసి తద్వారా వచ్చే లాభాలను రైతు ప్రయోజనాలకు వినియోగించాల్సిన డీసీఎంఎస్ అందుకు భిన్నంగా వ్యవహరించింది పాలకమండలి తీరుతో డీసీఎంఎస్ అప్పుల ఊబిలోకి వెళ్లిపోయింది. పాలక మండలి సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, విలాసవంతమైన జీవితం గడపడం కోసం రూ.13 కోట్లకు పైగా వెచ్చించి సినిమా వ్యాపారం చేశారు. లాభం వచ్చినా కూడా నష్టాలొచ్చాయని చెప్పి చివరకు అప్పు చూపించారు. ఈ నిర్వాకానికి కారణం గతంలో డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్న చిడిపోతు సుబ్బారావు. ఈయన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు సమీప బంధువు. అతని స్వార్థానికి డీసీఎంఎస్ నిలువునా బలైపోయింది. ఈ తతంగమంతా జిల్లా సహకార శాఖ అధికారులకు తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే అధికారులను కూడా వారి విధులు వారు నిర్వర్తించకుండా టీడీపీ నేతలు పెత్తనం చేశారు. -
డీసీఎంఎస్‌లో అక్రమాలపై చర్యలు
► రూ.6.48 కోట్లు దుర్వినియోగం ► ఈ–రేడియేషన్, విత్తన విక్రయాల్లో అవినీతి ► మాజీ చైర్మన్‌తో పాటు ముగ్గురు ఉద్యోగుల ప్రమేయం ► ప్రస్తుతం పనిచేస్తున్న ఓ అధికారి సస్పెన్షన్ ► ఉద్యోగ విరమణలో ఉన్న ఇద్దరు అధికారులు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లో జరిగిన అవినీతి అక్రమాలపై పాలక మండలి ఉక్కుపాదం మోపింది. డీసీఎంఎస్‌లో 2006–07 నుంచి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిధులు పక్కదారి పట్టాయంటూ పి.శ్రీనివాస్‌రెడ్డి 2013లో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ–రేడియేషన్ ప్లాంట్‌లో అవినీతి జరిగిందని, విత్తన విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, రూ. 7 కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలను లోకాయుక్తకు సమర్పించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో లోకాయుక్త డీసీఎంఎస్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని జిల్లా సహకార శాఖను ఆదేశించింది. దీంతో అసిస్టెంట్ రిజిస్టార్ ఎన్.వెంకటేశ్వర్లును విచారణ అధికారిగా నియమించారు. నెల రోజుల పాటు 2006–07 సంవత్సరం నుంచి ఆదేశించిన కాలం నాటికి డీసీఎంఎస్‌లో అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపారు. రికార్డులను పరిశీలించారు. 2006–07 ఆర్థిక సంవత్సరంలో డీసీఎంఎస్ రూ. 14 కోట్లతో ఈ–రేడియేషన్ ప్లాంట్‌ను ఖమ్మంలోని వెంకటగిరి గేటు వద్ద ఉన్న స్థలంలో నిర్మించాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి పనులు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. మిషనరీ కొనుగోలుకు కోటి రూపాయలు కేటాయించారు. డీసీఎంఎస్‌కు ఉన్న ఆస్తుల ఆధారంగా ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 1.55 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ బ్యాంక్ అప్పు వడ్డీతో కలుపుకొని రూ. 3.15 కోట్లకు చేరింది. ఈ అప్పులో రూ. 2 కోట్లు డీసీఎంఎస్ చెల్లించింది. అయినా అప్పు ఉండటంతో సంస్థకు మధిర, ఖమ్మంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంక్ సిద్ధమైంది. ఈ క్రమంలో అప్పులను చెల్లిస్తామని ప్రస్తుత మండలి వివరణ ఇస్తూ గిడ్డంగుల సంస్థ నుంచి సహకారం తీసుకొని అప్పులు చెల్లించింది.ఈ చెల్లింపులతో శాంతించిన బ్యాంక్ జప్తులను నిలిపివేసింది. ఏపీ సీడ్స్ ద్వారా వచ్చిన రూ. 3.84 కోట్ల విత్తనాల వ్యవహారంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది. విత్తన విక్రయాలకు సంబంధించి సరైన రికార్డులు లేవు. మొత్తంగా 2006–07 నుంచి 2012–13 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ. 6.48 కోట్లకు సంబంధించి సరైన రికార్డులు, లెక్కలు లేవని విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి చైర్మన్ రామచంద్రమూర్తి, మేనేజర్లు సీతారామయ్య, రాఘవరాజు, ప్రస్తుత అసిస్టెంట్ మేనేజర్ సాయిబాబాలు బాధ్యులుగా గుర్తించారు. అప్పటి పాలకవర్గం పదవీకాలం పూర్తి కాగా, మేనేజర్లుగా పనిచేసిన సీతారామయ్య, రాఘవరాజులు ఉద్యోగ విరమణ పొందారు. సాయిబాబా మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా సహకార శాఖ నిధుల అవినీతి, అక్రమాలపై సమగ్ర నివేదికను రూపొందించి ప్రస్తుత పాలకమండలికి పంపుతూ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నివేదకలో పేర్కొంది. సహకార చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని నివేదించటంతో డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య అధ్యక్షతన ఈ నెల 3వ తేదీన పాలక మండలి సమావేశమై సహకార శాఖ నివేదికపై చర్చించింది. డీసీంఎస్ సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సహకార చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించిన వారికి నోటీసులు అందించటంతో పాటు, రికవరీకి చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇక ఇక్కడే విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మేనేజర్ సాయిబాబాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ చైర్మన్ రామచంద్రమూర్తి, ఉద్యోగ విరమణ పొందిన మేనేజర్లు తమకున్న ఆధారా>ల ఆధారంగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. -
మార్కెటింగ్ మంత్రి వర్యా..మా మొర వింటారా !
⇔ బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన సంతోషమే.. ⇔ కానీ.. ఈ సారి బత్తాయి సీజన్‌కు ధరల ‘కత్తెర’ ⇔ నిమ్మ రైతుకు కుచ్చుటోపీ పెడుతున్న ట్రేడర్లు ⇔ ధాన్యం అమ్మిన డబ్బులు రాక 16 వేల మంది రైతుల ఎదురుచూపులు ⇔ కందుల కొనుగోళ్లలో పడరాని కష్టాలు పడ్డ రైతన్న ⇔ మిర్చి రైతు కంట్లో ‘కారం’... అన్ని పండ్ల ధరలూ అదే పరిస్థితి ⇔ సిద్ధమైనా.. ప్రారంభానికి నోచని మార్కెటింగ్ గోదాములు ⇔ డీసీఎంఎస్‌లో రూ. కోట్ల కుంభకోణం.. సొంత ఆస్తుల్లా అమ్ముకున్న సిబ్బంది ⇔ మీరు దృష్టి పెడితేనే జిల్లా రైతాంగానికి ఊరట సాక్షి, నల్లగొండ : దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న బత్తాయి మార్కెట్‌ను ఏర్పాటు చేయడంలో భాగంగా తొలి అడుగు వేసేందుకు మంగళవారం జిల్లాకు వస్తున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావుకు రైతాంగం స్వాగతం పలుకుతోంది. రూ.వేల కోట్ల బత్తాయి టర్నోవర్ ఉన్న జిల్లాలో మార్కెట్‌ను నిర్మించాలన్న ఆలోచనతో శంకుస్థాపన చేసేందుకు ఆయన రావడం సంతోషంగానే ఉన్నా.. జిల్లా అన్నదాతలు మాత్రం సమస్యల సుడిగుండంలో విలవిల్లాడిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, అమ్ముకునేందుకు సౌకర్యాలు లేక రైతన్నలు పడరాని కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ దృష్టిపెట్టాల్సిన ఉద్యాన, వాణిజ్య పంటలకు తోడు ధాన్యం రైతులు ఈ సీజన్లో పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బత్తాయి, ధాన్యం విషయంలో దిగుబడులు ఊహించని విధంగా రావడంతో సమస్యలు రాగా, మిగిలిన పంటల విషయంలో మాత్రం అన్నదాత మోసానికి గురవుతున్నాడు. కందుల నుంచి మామిడి పంట వరకు అన్ని విషయాల్లోనూ రైతన్న శ్రమ నిలువు దోపిడీకి గురవుతోంది. అన్నదాతల కష్టాలు అలా ఉంటే.. జిల్లాలో వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మాణం పూర్తి చేసుకున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోకపోవడం గమనార్హం. దీనికి తోడు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లో ఇటీవల వెలుగుచూసిన కోట్ల రూపాయల కుంభకోణం కూడా జిల్లాలో చర్చనీయాంశమైంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపనకు వస్తున్న మంత్రి అన్ని విషయాలపై దృష్టి సారించి, జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చి.. రైతన్నల సమస్యలు పరిష్కారం అయ్యేలా, వారు కష్టాల కడలి నుంచి గట్టెక్కేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతోంది. ధాన్యం కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. నాగార్జునసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ఉన్న నల్లగొండ జిల్లాలో «ప్రధాన పంట వరి కాగా.. ఈ సీజన్లో అన్నదాతలు పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రాలు ప్రారంభించిన సమయంలో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రోజుల తరబడి రైతులు మార్కెట్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లలేక, మార్కెట్లో అమ్ముకుని వెళ్లలేక సతమతమయ్యారు. ఇక, అమ్ముకున్న తర్వాత కూడా వారికి డబ్బులు చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతోంది. సాఫ్ట్వేర్ సమస్య పేరుతో ఈ సీజన్ మొత్తం ధాన్యం చెల్లింపుల్లో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 30 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని కొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఐకేపీ సెంటర్లు ఆయా రైతులకు చెల్లింపులు చేయడంలో ఇంకా జాప్యం చేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.460 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు జరగగా, ఇంకా రూ.170 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. 48 గంటల్లో ధాన్యం రైతులకు నగదు చెల్లిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. నిమ్మ రైతుకు కుచ్చుటోపీ నకిరేకల్ కేంద్రంగా జరిగే నిమ్మ వ్యాపారంలో ఈ సారి ఆ రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. గత సీజన్లో రూ.4వేల వరకు పలికిన నిమ్మ బస్తా ఈ సారి కేవలం రూ.1,000 నుంచి 1,200 వరకు మాత్రమే పలికింది. ఇందుకు స్థానిక ట్రేడర్లు సిండికేట్ కావడమే కారణం. అయితే.. ధరల అమలును పరిశీలించాల్సిన మార్కెటింగ్‌శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. దీంతో అడ్డగోలుగా కుమ్మక్కైన కమీషన్‌దారులు రైతులను నిలువునా ముంచేశాడు. బస్తా నిమ్మకాయలు అమ్ముకుని అన్ని ఖర్చులు పోను రూ.150 రూ.200 వరకు మాత్రమే ఇంటికి తీసుకెళ్లే పరిస్థితుల్లో నిమ్మ రైతు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక్కడ నిమ్మ మార్కెట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే మోక్షం లభించినా ఇంతవరకు స్థలం ఎక్కడన్నదానిపైనే అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా మీరు చొరవ తీసుకుని.. వచ్చే సీజన్ నాటికైనా నిమ్మ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైతాంగం కోరుతోంది. బత్తాయి ధరలకు ‘కత్తెర’ సమైక్య రాష్ట్రంలోనే బత్తాయి పంటకు పేరొందిన నల్లగొండ జిల్లాలో ఈసారి కత్తెర సీజన్ కన్నీళ్లనే మిగిల్చింది. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెరగాల్సి ఉంది. కత్తెర సీజన్ కాబట్టి రూ 30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర ఉంటుందని బత్తాయి రైతులు భావించినా.. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ సారి సీజన్లో టన్ను ధర రూ.10 వేల నుంచి 12 వేలకు పడిపోయింది. దీంతో రైతులు కన్నీళ్లతోనే బత్తాయిని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బత్తాయి పంట సీజన్ 95 శాతం పూర్తయిన తర్వాత టన్నుకు రూ.27వేల ధర పలుకుతోంది. మీ హయాంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయడం ద్వారా రూ.18 వేల కోట్ల వరకు జరిగే వ్యాపారంలో ముఖ్యంగా రూ.200 నుంచి రూ.300 కోట్ల రూపాయల రవాణా ఖర్చులు రైతన్నకు మిగలనున్నాయి. అయితే, ఎస్సెల్బీసీ సమీపంలో 12 ఎకరాల్లో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ మార్కెట్లో ట్రేడ్ లైసెన్సులు ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటేనే మార్కెట్ ఏర్పాటు ఆంతర్యం నెరవేరనుంది. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా 2.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అందులో బత్తాయి, మామిడి, సపోట, జామ, బొప్పాయి, అరటి వంటి పంటలున్నాయి. వీటికి కూడా మద్దతు ధర లభించని దుస్థితి నెలకొంది. -
సహకార ఉద్యమ బలోపేతానికి ప్రోత్సాహం
సహకార ఉద్యమం, బలోపేతం, మంత్రి యనమల ఆర్థిక మంత్రి యనమల బోట్‌క్లబ్ (కాకినాడ): రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం, సహాయం అందిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్థానిక రామారావుపేటలో కొత్తగా నిర్మించిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ గొడౌన్, కార్యాలయ భవనం, 50 కేవీ రూఫ్ టాప్ సోలార్ ఫ్లాంట్లను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల మంగళవారం ప్రారంభించారు. యనమల మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థ అన్నారు. సహకార వ్యవస్థ బలోపేతమైతే ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. డీసీఎంఎస్‌లు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు« దోహదం చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను తిరిగి లాభాల బాటలోకి తెచ్చిన సంస్థ చైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్లను అభినందించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ డీసీఎంఎస్ ఎరువుల వ్యాపారంతో పాటు లాభసాటైన అన్ని వ్యాపారాలను చేపట్టి ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. డీసీఎంఎస్‌లకు సామర్లకోట, తుని, అమలాపురం పట్టణాల్లో విలువైన స్థలాలు ఉన్నాయని, వాటిని షాపింగ్ కాంప్లెక్సులుగా నిర్మించి ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినాడు సంస్థ రూ.కోటి 25 లక్షల నష్టాల్లో ఉండేదని, ప్రస్తుతం రూ.రెండు లక్షల లాభంలో ఉందన్నారు. నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనంపై 50 కేవీ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా సొంత అవసరాలు తీరతాయని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, చిర్ల జగ్గిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS ఎ¯ŒS.వీర్?రడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఖాతాలోకే డీసీఎమ్మెస్..
అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవం పంతం నెగ్గించుకున్న తూర్పు ప్రాంత నేతలు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అధికార పార్టీ టీఆర్ఎస్ ఖాతాలో మరో పదవి పడింది. జిల్లా సహకార మార్కెట్ సంఘం చైర్మన్ పదవి కోసం అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గురువారం డీసీఎమ్మెస్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో అధికార పార్టీకి చెందిన కె.శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతనెల 28న అవిశ్వాసం ద్వారా ఖాళీ అయిన చైర్మన్ పదవికి పది మంది డెరైక్టర్ల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. చైర్మన్ పదవి కోసం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఎనిమిది మంది డెరైక్టర్లు పాల్గొనగా ఏడుగురు ఆయనకు మద్దతుగా చేతులు లేపారు. డెరైక్టర్లు బి.వినోద్‌రెడ్డి, బిక్కు రాథోడ్, రాములు, దేవన్న, త్రయంబక్, లాలూనాయక్, దిలిప్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లు జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు ప్రకటించారు. ఇప్పటివరకు వైస్ చైర్మన్‌గా కొనసాగిన ఆయన రాజీనామా చేసి చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు. తూర్పు ప్రాంతానికే పదవి.. కాగా.. డీసీఎమ్మెస్ చైర్మన్ పదవి కోసం పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేశారు. అయినా.. తూర్పు ప్రాంతమైన లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్కు చెందిన శ్రీనివాస్‌రెడ్డికే ఆ పదవి లభించింది. ఇతర పార్టీల్లో కొనసాగిన ఆరుగురు డెరైక్టర్లు చైర్మన్ ఎన్నికకు ఒకరోజు ముందు టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే ఏకగీవ్రంగా ముగిసింది. శ్రీనివాస్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వైస్‌చైర్మన్ పదవికి కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మళ్లీ ఆ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. డెరైక్టర్ దేవన్న ఇందుకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ ఎన్నికకు మాజీ చైర్మన్ ఐర నారాయణరెడ్డి, డెరైక్టర్ కోటేశ్వర్రావు హాజరు కాలేదు. అవినితీపై విచారణ చేపడుతాం.. - శ్రీనివాస్‌రెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్ గత చైర్మన్ అవినితికి పాల్పడడంతోనే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని కొత్తగా చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల పథకంలో అక్రమాలకు పాల్పడ్డారని, గతంలో ఏ కుంభకోణాలకు పాల్పడ్డారో వాటన్నింటిపై విచారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతూ.. రైతులను మోసం చేస్తూ అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలుకు ఎలాం టి ఇబ్బంది కలగకుండా చేస్తానని, తానూ రైతు బిడ్డనేనని, తనకూ రైతుల కష్టాలు తెలుసునని అభిప్రాయపడ్డారు. తదుపరి డెరైక్టర్లు, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, లక్సెట్టిపేట జెడ్పీటీసీ చిన్నయ్య, నాయకులు పాల్గొన్నారు. -
నేడు డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ ఎవరో శనివారం తేలనుంది. అత్తాపూర్ కార్యాలయంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక జరుగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య పోలింగ్ జరుగనుంది. ఇదివరకే గెలుపొందిన పది మంది డెరైక్టర్లు ఓటు హక్కును వినియోగించుకోన్నారు. ఆర్నెళ్ల క్రితం దాఖలైన ఒక నామినేషన్‌ను చివరి నిమిషంలో విత్‌డ్రా చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా అధికారపార్టీలో పెనుదుమారం రేపిన సహకార ఎన్నికలు మాజీ మంత్రి సబిత, ప్రస్తుత మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సవాల్‌గా మారాయి. గతంలోను ఇరువురు తమ ప్యానెళ్లను గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పీఠాలను తమవర్గాలకు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఇరువురు పోటీపడ్డారు. డీసీసీబీ అధ్యక్ష పదవిని తన అనుచరుడు లక్ష్మారెడ్డికి దక్కడంలో కృతకృత్యురాలయిన సబిత.. డీసీఎంఎస్‌ను తమ మద్దతుదారుడికే కట్టబెట్టేలా చక్రం తిప్పారు. రెండు పదవులు వైరివర్గం కైవసం చేసుకోవడాన్ని మింగుడుపడని ప్రసాద్.. తన అనుయాయుడు దారాసింగ్ అభ్యర్థిత్వానికే ఓటేయాలని పట్టుబట్టారు. అయితే, అప్పటికే డీసీఎంఎస్ చైర్మన్ పదవికి శ్రవణ్‌కుమార్ నామినేషన్ వేయడం.. మెజార్టీ డెరైక్టర్లు ఆయన పక్షానే నిలవడంతో సబిత కూడా వారికే అండగా నిలిచారు. దీంతో తీవ్ర అసంతృప్తికిలోనైన ప్రసాద్ సామాజిక న్యాయాన్ని తెరమీదకు తెచ్చారు. తన మద్దతుదారుకు గాకుండా... సబిత మరొకరిని తెరమీదకు తేవడం ద్వారా ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశాన్ని పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ ముందు పంచాయితీ పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు.. శ్రవణ్‌కుమార్ చేత నామినేషన్ ఉపసంహరింపజేయాలని సూచించారు. సీఎం, పీసీసీ సూచనలతో వెనక్కి తగ్గడమేగాకుండాశ్రవన్‌తో నామినేషన్ విత్‌డ్రా చేయించారు. దాఖలైన ఒక నామినేషన్ కూడా విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శనివారం డీసీఎంఎస్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. అదే పట్టు..! సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రసాద్, సబిత మాత్రం తమ పంతం నెగ్గించుకునేందుకు వ్యూహరచన చేశారు. శ్రవణ్‌కుమార్‌ను గెలిపించుకునేందుకు అవసరమైన డెరైక్టర్లను సబిత కూడగట్టారు. వారం రోజులుగా తీర్థయాత్రలు తిరిగొచ్చిన డెరైక్టర్లు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. మరోవైపు గతంలో తాను ప్రతిపాదించిన దారాసింగ్‌కు డీసీఎంఎస్ చైర్మన్‌గిరి కట్టబెట్టేందుకు ప్రసాద్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మెజార్జీ సభ్యులు శ్రవణ్ గూటిలో ఉన్నప్పటికీ, అధిష్టానం ద్వారా సబితపై ఒత్తిడి పెంచేందుకు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా అవసరమైతే మరోసారి ఎన్నిక లు వాయిదాపడేలా చేసేందుకు మంత్రి వ్యూహం రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. -
అధికార పార్టీలో ‘సహకార’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో ‘సహకార’ పోరు మళ్లీ షురువైంది. జిల్లా మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబిత వర్గపోరుతో వాయిదాపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 31న డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఎన్నుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికలతో రాజుకున్న చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థుల ఖరారుపై జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ మధ్య తలెత్తిన వివాదం ఆ పార్టీలో పెను దుమారమే రేపింది. చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఇరుపక్షాలూ ఆధిపత్య పోరుకు దిగడంతో డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఇరువర్గాలూ పావులు కదుపుతున్నాయి. డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, తన వర్గం అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేయడం ద్వారా మెట్టు దిగారు. ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ డీసీఎంఎస్‌కు నెలాఖరున ఎన్నికలు జరుగనున్నాయి. గత పరిణామాల దృష్ట్యా వైరివర్గంపై పైచేయి సాధించేందుకు ఇరువర్గాలూ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఇలా.. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని తన మద్దతుదారులకు దక్కకుండా సబిత వర్గం శ్రావణ్ కుమార్‌తో నామినేషన్ దాఖలు చేయించడంపై మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. పదవుల కేటాయింపుల్లో సామాజిక న్యాయంపాటించాలని సీఎం, పీసీసీ చీఫ్ స్పష్టం చేసినా వారి ఆదేశాల్ని సబిత ఉల్లంఘించారని ఆక్రోషించారు. ఇదే విషయంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని భావించిన ప్రసాద్.. ఆమె వ్యవహార శైలిపై ఏకంగా సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు ఫిర్యాదు చేశారు. డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దారాసింగ్‌కు కట్టబెట్టేలా చూడాలని కోరారు. అయితే దారాసింగ్ అభ్యర్థిత్వంపై అప్పటి మంత్రి సబిత అభ్యంతరం వ్యక్తంచేయడం వివాదానికి దారితీసింది. ఆఖరికి అధిష్టానం పెద్దల మాటలకు కట్టుబడి సబిత శ్రావణ్‌కుమార్ నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. అయితే దారాసింగ్‌ను కనీసం ప్రతిపాదించేందుకు కూడా సభ్యులెవరూ లేకపోవడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడెలా..! మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో డీసీఎంఎస్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి. అప్పట్లో హోంమంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన సబిత ప్రాభవం ఇప్పుడు తగ్గిపోయినప్పటికీ, అధికారపార్టీలో మాత్రం ఆమె హవా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా సహకార ఎన్నికల్లో ఆమె బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సొసైటీలను చేజిక్కించుకున్నారు. అప్పట్లో హైకమాండ్ ఆదేశాలకు తలొగ్గి తన అనుచరుడితో నామినేషన్ ఉపసంహరింపజేసిన సబిత వారం రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన దారాసింగ్ అభ్యర్థిత్వానికే మంత్రి ప్రసాద్‌కుమార్ మొగ్గు చూపుతున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సబిత వర్గం తమతో కలిసి రావాల్సిందేనని ఆయన అంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా.. చైర్మన్‌గిరిపై కన్నేసిన ఇరువర్గాలూ డెరైక్టర్లను రహస్య క్యాంపులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యాయి.