సమావేశంలో చర్చిస్తున్న ఆప్కో చైర్మన్ చిల్లపల్లి, కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ పడమట స్నిగ్ధ
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఎక్కువగా వినియోగించే ధోవతీలు, టవల్స్, లుంగీలు, బెడ్ షీట్లు, కాటన్, చేనేత చీరలను అందుబాటు ధరల్లో ఉంచేందుకు డీసీఎంఎస్‌తో కలిసి పనిచేస్తామని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
ఈ విషయమై ఆప్కో, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సంస్థల మధ్య సోమవారం సమాలోచనలు జరిగాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని డీసీఎంఎస్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్‌పర్సన్ పడమట స్నిగ్ధతో సమావేశమై చర్చించామని పేర్కొన్నారు. మార్కెటింగ్ సొసైటీల ద్వారా రైతులకు ఆప్కో వస్త్రాలు విక్రయించే ప్రకియను పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment