Apollo Tyres
-
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్‌కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్‌లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్‌లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్‌లోని హైదరాబాద్‌లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్‌కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్‌గా కొనసాగుతోంది. -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
అపోలో టైర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్
న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల కంపెనీ అయిన అపోలో టైర్స్ తన సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను నియమించింది. కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్ తెలిపింది. సచిన్ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ వెల్లడించారు. సచిన్‌తో తమ ప్రయాణం సుదీర్ఘ కాలం సాగించడానికే ఇష్టపడతున్నామన్నారు. భారత్‌లో ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నయన్ ఎఫ్సీకి ప్రధాన స్పాన్సరర్‌గా, మినర్వా పంజాబ్ ఎఫ్సీకి టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కాగా విదేశాల్లోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్, మాంఛెస్టర్ యునైటెడ్ లాంటి వాటికి అపోలో టైర్స్ గ్లోబల్ టైర్ పార్టనర్‌గా ఉన్న కంపెనీ దేశీయంగా కూడా తమ ఉత్పత్తులను మరింత పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే సచిన్ లాంటి సెలబ్రిటీతో ఒప్పందాలు కుదుర్చుకుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. -
అపోలో టైర్స్ ఎండీకి షాక్ : వేతనాల కోత
సాక్షి,ముంబై: దేశంలోనే అతిపెద్ద టైర్ల పరిశ్రమ అపోలో టైర్స్ కంపెనీకి అపోలో టైర్స్ లిమిటెడ్ ఛైర్మన్ ఒంకార్ కన్వర్, ఆయన కుమారుడు, ఎండీ, కంపెనీ ఉపాధ్యక్షుడు నీరజ్ కన్వర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ వీరికి చెల్లించే చెల్లింపుల్లో 30శాతం కోత పడింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ పునః నియామకాన్ని కూడా కంపెనీ తిరస్కరించింది. అపోలో టైర్స్ బోర్డుకు చెందిన నామినేషన్స్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి వారి మొత్తం పరిహారాన్ని 30 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రమోటర్ల వేతనాలు పన్ను చెల్లించే ముందు లాభంలో 7.5 శాతం పరిమితి ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. పనితీరు ఆధారిత వేతనం మొత్తం పరిహారంలో సుమారు 70 శాతంగా ఉండాలి, ప్రమోటర్ల వార్షిక ఇంక్రిమెంట్స్ కూడా కంపెనీ సీనియర్ నిపుణులకి అనుగుణంగా ఉండాలని ప్యానెల్ స్పష్టం చేసింది. అపోలో టైర్స్ ఎండీ నీరజ్ కన్వర్ కొనసాగింపునకు కంపెనీలో మైనార్టీ వాటా కలిగిన షేర్ హోల్డర్స్ ససేమిరా అన్నారు. ఈ షాకింగ్ పరిణామంతో కంపెనీలో మేజర్ వాటా కలిగిన నీరజ్ కు షేర్ హోల్డర్స్ చేతిలో అతి పెద్ద ఒటమి ఎదురైనట్టైంది. నీరజ్ వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పరిహారాలను తీసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఎండీగా కొనసాగడానికి అర్హుడు కాదని అపోలో టైర్స్ షేర్ హోల్డర్స్ అభిప్రాయ పడ్డారు. సెప్టెంబరు 12న జరిగిన ఓటింగ్ లో కంపెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా నీరజ్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2016 లో రు. 30 కోట్లు హౌజ్ అలవెన్స్‌గా తీసుకున్న నీరజ్ 2017లో ఆయన నిర్వాహణలో కంపెనీ లాభాలు గత సంవత్సరం 34 శాతం తగ్గి రు.622 కోట్లకే పరిమితమైనప్పటికీ , 41 శాతం పెంపుతో 42.8 కోట్లను డ్రా చేశారు నీరజ్. పే-టు-లాభం నిష్పత్తి పరంగా నీరజ్‌కు అందినపరిహారం దాదాపు రెట్టింపు అయ్యింది. అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరానికి తండ్రీకొడు కుల జీతం-లాభం నిష్పత్తి రెండింతలైందిట. ఇదే షేర్ హోల్డర్స్ లో నీరజ్ పై అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
చంద్రబాబు అంకెల గారడీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని, అంకెలతో గారడీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అపోలో టైర్స్ పరిశ్రమపై ముఖ్యమంత్రి మంగళవారం చేసిన ప్రకటనతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాలు, జీడీపీ లెక్కలు, వీటితో పాటు చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనల్లో కూడా ఎక్కడా వాస్తవం కనిపించటం లేదని మండిపడ్డారు. 2022 నాటికి ఏపీ దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందని, 2019 నాటికి నంబర్ 1గా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటుందని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఈ పిచ్చి మాటలను ఆయన దార్శనికతకు నిదర్శనంగా మళ్లీ మీడియాలో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల అవకతవకలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని బహిరంగ సవాల్‌ను విసిరారు. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టంచేశారు. -
చట్ట ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ మెంట్స్
స్పష్టం చేసిన ‘పనామా పేపర్స్’ కంపెనీలు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చట్టాల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ‘పనామా పేపర్స్’లో పేర్లున్న కార్పొరేట్ కంపెనీలు స్పష్టం చేశాయి. పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నామని తమపై వచ్చిన వార్తలు సరికాదని డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, ఇండియాబుల్స్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆర్బీఐ పరిమితికి లోబడే ఇన్వెస్ట్మెంట్స్... ఆర్బీఐ, ఫెమా, ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనల ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని డీఎల్ఎఫ్ సీఈఓ రాజీవ్ తల్వార్ చెప్పారు. డీఎల్ఎఫ్ ప్రమోటర్ కుటుంబం బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేశాయని, కోటి డాలర్ల వరకూ నల్లధనాన్ని పోగేసుకున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. 2004లో ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకారమే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో తమ ప్రమోటర్ గ్రూప్‌లు ఒక్క కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. వివరాలన్నీ ప్రతి ఏటా ఆదాయపు పన్ను విభాగానికి నివేదిస్తునే ఉన్నామని, డీఎల్ఎఫ్ వార్షిక నివేదికలోనూ పొందుపరుస్తామని వివరించారు. అంతా నిబంధనల ప్రకారమే... విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే చట్టాల ప్రకారమే అపోలో టైర్స్ గ్రూప్ చైర్మన్ ఓంకార్ కన్వర్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశారని అపోలో గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని వివరించారు. అపోలో గ్రూప్ చైర్మన్ కుటుంబ సభ్యులు చాలా మంది ఎన్నారైలని, ఇతర దేశాల చట్టాల ప్రకారమే వారు పెట్టుబడులు పెట్టారని వివరించారు. భారత దేశ ఆదాయపు పన్ను చట్టం, ఆర్బీఐ నియమనిబంధనలు, ఆంక్షలు వారికి వర్తించవని స్పష్టం చేశారు. భారత్‌లో పూర్తిగా పన్నులు చెల్లించిన తర్వాతనే విదేశాల్లో ఇన్వెస్ట్ చేశామని ముంబైకి చెందిన ఇండియాబుల్స్ సంస్థలకు చెందిన సమీర్ గెహ్లాట్ పేర్కొన్నారు. -
అపోలో టైర్స్ చేతికి జర్మనీ సంస్థ
రూ.301 కోట్లతో టైర్ల పంపిణీ కంపెనీ రిఫిన్‌కమ్ కొనుగోలు న్యూఢిల్లీ: భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు). రిఫిన్‌కమ్ ఆరు దేశాల్లో (జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్) ఆన్లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనితోపాటు జర్మనీలో 37 స్టోర్లు, సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. యూరోప్‌లో వృద్ధి లక్ష్యం...: యూరోప్‌లో వ్యాపారం మరింత వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. అన్ని కాలాల్లో అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ (సరఫరా నెట్వర్క్) రిఫిన్‌కమ్ విజయానికి ప్రధాన కారణం. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, సేవలను కస్టమర్లకు అందించడానికి అపోలో టైర్స్‌కు పూర్తిగా సహకరిస్తామని రిఫిన్‌కమ్ మేనేజింగ్ డెరైక్టర్లు ఓలాఫ్ స్కాయిల్, హికో నిగ్స్ తెలిపారు. తాజా పరిణామం నేపథ్యంలో సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అపోలో టైర్స్ షేర్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 1.68 శాతం ఎగసి (రూ.2.60) రూ.157.70కి చేరింది.