అపోలో టైర్స్‌ ​బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ | Apollo Tyres Ropes in Sachin Tendulkar as Brand Ambassador | Sakshi
Sakshi News home page

అపోలో టైర్స్‌ ​బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌

Published Fri, Nov 23 2018 8:32 PM | Last Updated on Fri, Nov 23 2018 9:00 PM

Apollo Tyres Ropes in Sachin Tendulkar as Brand Ambassador - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల కంపెనీ అయిన అపోలో టైర్స్‌ తన సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌ను నియమించింది. కంపెనీకి ఐదేళ్ల పాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అపోలో టైర్స్‌ కంపెనీ సచిన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఒక సెలబ్రిటిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా కుదుర్చుకోవడం ఇదే మొదటిసారని అపోలో టైర్స్‌ తెలిపింది.

సచిన్‌ టెండూల్కర్‌తో అనుబంధం తమకు ప్రయోజనం కలిగిస్తుందని కంఎనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ నీరజ్‌ కన్వర్‌ వెల్లడించారు. సచిన్‌తో తమ ప్రయాణం సుదీర్ఘ కాలం సాగించడానికే ఇష్టపడతున్నామన్నారు. భారత్‌లో ఇండియన్‌ సూపర్‌  లీగ్‌లో చెన‍్నయన్‌ ఎఫ్‌సీకి ప్రధాన స్పాన్సరర్‌గా,  మినర్వా పంజాబ్‌ ఎఫ్‌సీకి టైటిల్‌ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నామని తెలిపారు.

కాగా విదేశాల్లోని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్, మాంఛెస్టర్‌ యునైటెడ్ లాంటి వాటికి అపోలో టైర్స్ గ్లోబల్ టైర్ పార్టనర్‌గా ఉన్న కంపెనీ దేశీయంగా కూడా తమ ఉత్పత్తులను మరింత పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే సచిన్ లాంటి సెలబ్రిటీతో ఒప్పందాలు కుదుర్చుకుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement